ఫిల్మ్ నగర్ లోని రూ.200 కోట్ల ప్రాపర్టీపై మెగా కోడలి కన్ను?

మెగా కోడలు ఉపాసన గురించి మెగా ఫ్యామిలోకి వచ్చాకే అర్థమైంది. హీరో రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో బాధ్యతలు మోస్తుంది ఉపాసన.

 Upasana Wants To Buy Jeevitha Rajasekhar Propert-TeluguStop.com

ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు ఆరోగ్య సమస్యల గురించి ఉచిత సలహాలు ఇస్తుంది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కూడా తన వంతు సహాయం తో ముందుకు వచ్చింది.అంతేకాకుండా బిజినెస్ వైపు కూడా బాగా ఆసక్తి చూపుతుంది.

 Upasana Wants To Buy Jeevitha Rajasekhar Propert-ఫిల్మ్ నగర్ లోని రూ.200 కోట్ల ప్రాపర్టీపై మెగా కోడలి కన్ను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా ఫిలింనగర్ లోని రెండు వందల కోట్ల ప్రాపర్టీ పై ఉపాసన కన్ను పడింది.

Telugu Film Nagar, Jeevitha Rajasekhar, Tollywood, Upasana-Movie

తెలుగు సినీ నటులు జీవిత రాజశేఖర్ ఈ మధ్య ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు.ఇక తాజాగా తాము ప్రస్తుతం తమ ఆస్తిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఫిలిమ్ నగర్ లో వీరికి దాదాపు రెండు వందల కోట్ల ప్రాపర్టీ ఉందని తెలుస్తుంది.

ఇందులో వేరే సంస్థల వాటా కూడా ఉందట.ఇక ఇందులో జీవిత రాజశేఖర్ లకు తమ షేర్ కింద రూ.200 కోట్లు ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ ప్రాపర్టీని అమ్మేసి మరో చోట కొనాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Telugu Film Nagar, Jeevitha Rajasekhar, Tollywood, Upasana-Movie

ఇక వీటిని మెగా కోడలు ఉపాసన కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిసింది.ఇక ఈ ప్రాపర్టీ లో హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు, ఎన్టీఆర్ వంటి వాళ్లకు కూడా షేర్స్ ఉన్నాయని తెలుస్తుంది.ఇక జీవిత రాజశేఖర్ లు తమ ప్రాపర్టీని అమ్మి విప్రో సర్కిల్ వద్ద మరో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.ఈ నేపథ్యంలో ఉపాసనకు ఫిలింనగర్ ప్రాపర్టీ పై కన్ను పడగా మొత్తానికి కొనుగోలు చేయడానికి ఉపాసన ఆసక్తి చూపుతుందన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అసలు విషయం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

#Upasana #Film Nagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు