పంజరంలో రామ చిలుక! చిరంజీవి కోడలకి కోపం వచ్చింది

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా తెలుగు ప్రేక్షకులకి అందరికి పరిచయం ఉన్న పేరు ఉపాసన కొణిదెల.ఆమె మెగా ఫ్యామిలీ కోడలిగా కంటే సొసైటీలో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గా, అలాగే సోషల్ యాక్తివిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.

 Upasana Ram Charan Save Parrots-TeluguStop.com

ఉన్నంత కుటుంబంలో పుట్టి, మరో పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్ళిన కూడా ఆమె సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది.ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల సంరక్షణలో భాగం అవుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన అప్పుడప్పుడు సోషల్ అవేర్నెస్ కలిగించే ట్వీట్స్ చేస్తూ ఉంటుంది.తాజాగా రామచిలుకతో తాను దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దానిపై ఒక ట్వీట్ కూడా చేసింది.రామచిలుక ఏపీ రాష్ట్ర పక్షి అని మీకు తెలుసా… రామచిలుకనే కాదు ఏ పక్షినైనా పంజరంలో బంధించడం నేరం.

దీనిపై ఆరేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది.ఇలాంటి విషయాలపై కనీస అవగాహన కలిగివుండడం వన్యప్రాణి సంరక్షణలో మొదటి అడుగుగా అనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.

రామచిలుక శాస్త్రీయనామం సిట్టాక్యులా క్రామెరి అని కూడా తన ట్వీట్ లో తెలియజేశారు.సిటీ చాలా మంది రామ చిలుకని పంజరంలో బంధించి చిలక జోస్యం చెబుతూ ఉంటారు.

అలాగే కొంత మంది వీటిని పెంచుకుంటూ ఉంటారు.అలాంటి వారికి అర్ధమయ్యే విధంగా ఉపాసన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube