రాణిని దత్తత తీసుకున్న ఉపాసన.. మెగా ఫ్యాన్స్‌ ఆనందం

మెగా ఫ్యాన్స్‌ ఉపాసన బర్త్‌డేను నిన్న సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జరుపుకున్నారు.

సోషల్‌ మీడియాలో ఆమెను ప్రశంసలతో ముంచెత్తి ఆమెకు బర్త్‌డే విశెష్‌ను తెలియజేశారు.

ఇక ఉపాసన కూడా నిన్న తన బర్త్‌డే సందర్బంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అపోలో ఫౌండేషన్‌ ద్వారా మామూలుగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహణ కార్యక్రమాలు నిర్వహించే ఉపాసన నిన్న నెహ్రూ జూ పార్క్‌ ను సందర్శించింది.

ఈ సందర్బంగా అక్కడ రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు.