పోస్టర్ పై స్పందించిన ఉపాసన.. చరణ్ ను దేవుడితో పోలుస్తూ..?

2021 సంవత్సరంలో 450 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది సెకండాఫ్ లో దసరా పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుండగా ఈ సినిమాకు పోటీగా మరే సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.

 Upasana Konidela Reacts On Ram Charan Ramaraju Motion Poster In Rrr Movie, 450 C-TeluguStop.com

కలెక్షన్లపరంగా బాహుబలి 2 కొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఆర్ఆర్ఆర్ ఆ రికార్డులను అధిగమించి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న రామ్ చరణ్ ఫోటో విడుదలైంది.

చరణ్ ను రామరాజు లుక్ లో చూసిన ఉపాసన రామ్ చరణ్ తనకు శ్రీరాముడిలా కనిపిస్తున్నాడంటూ పోస్ట్ చేశారు.ఉపాసన చేసిన పోస్ట్ కు లక్షల సంఖ్యలో లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.

మరోవైపు రామ్ చరణ్ లుక్ ను చూసిన చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

రామరాజు పాత్రలో రామ్ చరణ్ ఉగ్రరూపంలో పోస్టర్ లో కనిపిస్తున్నారు.గతేడాది రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా ఈ ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి.చరణ్ కు సంబంధించిన లుక్ నిన్న విడుదల కాగా మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఫోటో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి రిలీజ్ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడకూడదని రాజమౌళి భావిస్తున్నారని సమాచారం.అక్టోబర్ లో సినిమా రిలీజ్ కానుండగా సెప్టెంబర్ లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube