మంచి చేయాలనుకున్న ఉపాసనపై సోషల్ మీడియాలో ఇంతలా...   

Upasana Konidela React About Narendra Modi Tweet - Telugu Upasana Konidela, Upasana Konidela Latest News, Upasana Konidela News, , Upasana Konidela Social News

సమాజానికి మంచి చేయడంలో తనకు తోచినంత సహాయం చేస్తూ, అలాగే తగిన సలహాలు ఇస్తూ సోషల్ మీడియాలో మంచి పనుల పై అవగాహన కల్పించడంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెల ఎప్పుడూ ముందు ఉంటుంది.అంతేగాక ఇప్పటికే ఈమె ఒకపక్క వ్యాపారాలను చూసుకుంటూ మరోపక్క కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

Upasana Konidela React About Narendra Modi Tweet

అయితే తాజాగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమెన్స్ డే సందర్భంగా  ఏదో ఒకరోజు తన సోషల్ మీడియా ఖాతాలకి సంబంధించినటువంటి పేజీలను మహిళలకు అప్పగిస్తానని వీటి ద్వారా మహిళలు దేశాన్ని మంచి పథంలో నడిపించడానికి అవసరమైనటువంటి సలహాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు వంటి వాటిని తెలియజేయవచ్చునని తెలిపిన సంగతి తెలిసిందే.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేటువంటి ఉపాసన కొణిదెల ఈ విషయంపై స్పందించారు.

ఇందులో గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు తనకు సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక పేజీని ఇవ్వాలని దీంతో దేశానికి కావలసినటువంటి పలు ఆరోగ్య సూచనలని  తాను అందిస్తానని పేర్కొన్నారు.దీంతో ఉపాసన చేసినటువంటి ఈ మంచి పనికి పలువురు అభినందిస్తున్నారు.అంతేగాక రోజులో ఎక్కువ సమయం మొత్తాన్ని వ్యాపారంతో మరియు కుటుంబ బాధ్యతలతో బిజీబిజీగా గడిపిన టువంటి ఉపాసన కొణిదెల దేశానికి అవసరమైనటువంటి ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అంటున్నారు.

అయితే మరికొంత మంది నెటిజన్లు మాత్రం ఇవన్నీ తమ మార్కెట్ వ్యాల్యూ పెంచుకోవడానికి చేసేటువంటి స్టంట్లు అని కామెంట్ చేస్తున్నారు.

అంతేకాక ఉపాసన ని ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ జరిగే అక్రమాలు గుర్తించమనండి, దేశానికి ఆమె సలహాలు అక్కర్లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.కొందరైతే ముందు తమ హాస్పిటల్లో లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని వీలైతే డబ్బులు కట్టలేని పేదవారికి ఉచితంగా వైద్యం అందించేట్లు చూడమని అంటున్నారు.

దీంతో సరైన అవగాహన లేని వ్యక్తులు చేసే టువంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు అంటూ ఉపాసన కి కొంతమంది అండగా నిలుస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Upasana Konidela React About Narendra Modi Tweet-upasana Konidela Latest News,upasana Konidela News,upasana Konidela Social News Related....