మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య అనే స్టేటస్ కంటే ఉపాసన కొణిదలకి సోషల్ యాక్టివిస్ట్ గా మంచి గుర్తింపు ఉంది.అలాగే అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గా కూడా ఆమె ప్రముఖ వ్యక్తుల జాబితాలో ఉంది.
అలాగే ఆమె పాజిటివ్ అనే ఓ హెల్త్ మ్యాగజైన్ ని కూడా రన్ చేస్తుంది.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆమె సేవ్ ఎనిమల్స్ అంటూ సోషల్ అవేర్ నెస్ చేస్తుంది.
అలాగే కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలని కూడా అందరితో పంచుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ప్రానిక్ హీలింగ్ ని ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టారు.నిజానికి అపోలో హాస్పిటల్స్ కి డైరెక్టర్ గా ఉండి, కేవలం ఆరోగ్యాన్ని క్యూర్ చేయడంలో ఎలాంటి ప్రామాణికం లేని మేడికేషన్ ప్రక్రియ ప్రాణిక్ హీలింగ్ ని ప్రమోట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రాణిక్ హీలింగ్ మీ లైఫ్ నుండి నెగిటివిటీ తొలగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మనతో పాటు ఇతరులను కూడా స్వస్థపరిచే శక్తి ఉందని ప్రతి ఒక్కరికి బోధిస్తుంది.నా ప్రాణిక్ హీలర్ శ్రీనివాస్ రెడ్డి ఒక టీవీ నటుడు.
ఆయనకు ఇష్టమైన వ్యక్తి అనారోగ్యం కారణంగా యాక్టింగ్ ని వదులుకున్నాడు.అతను ఇప్పుడు ఫుల్ టైమ్ హీలర్.
అతనికి ఇష్టమైన వ్యక్తికి కూడా పూర్తిగా నయమైంది.చక్రాల ప్రతిష్టంభన అనేక ఆరోగ్య లేదా మానసిక సమస్యలకు మూల కారణం కావచ్చు.
దీనికి బెస్ట్ నివారణ విల్ పవర్ అండ్ పాజిటివ్ ఎనర్జీ.నేను మన చుట్టూ ఉన్న వారి వైఖరిలో చాలా మార్పును చూశాను.
నేను పవర్ ఆఫ్ ప్రాణిక్ లేదా క్రిస్టల్ హీలింగ్ ను నమ్ముతున్నాను.అంతేకాకుండా మీరు కూడా దీనిని ప్రయత్నించమని రికమెండ్ చేస్తున్నాను అని పోస్ట్ చేసింది.
దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే, కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.