కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఉపాసన..?

గతేడాది మన దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభించి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే.కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు.

 Ram Charan Wife Upasana  Key Comments  About Corona Vaccine,appollo Medicals,com-TeluguStop.com

వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే ఒకటి కంటే ఎక్కువ కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.అయితే ప్రజల్లో చాలామంది కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ల గురించి భయాందోళనకు గురి కావడంతో వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.

అయితే రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడంతో వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.అపోలో ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న ఉపాసన వ్యాక్సిన్ గురించి ఎలాంటి సంకోచాలు అవసరం లేదని అన్నారు.

Telugu Covid Vaccine, Ram Charan, Upasana-Movie

కరోనా వ్యాక్సిన్ వల్ల తనకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని అపోహలు వీడి వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు.కరోనా వ్యాక్సిన్ అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ను తీసుకోవాలని అప్పుడు మాత్రమే కరోనా నుంచి సేఫ్ గా బయటపడగలిగే అవకాశం ఉంటుందని తెలిపారు.అపోలో హాస్పిటల్ లో పని చేసే ఫ్రంట్ లైన్ సిబ్బంది కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలని ఆమె సూచించారు.

దేశంలోని పలు చోట్ల వ్యాక్సిన్ల వల్ల దుష్పరిణామాలు వస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అపోహలు తొలగించే దిశగా ఉపాసన ముందడుగు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల కొత్తరకం కరోనా వైరస్ లకు కూడా చెక్ పెట్టవచ్చని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube