నువ్వు నన్ను వదిలేశావు.. చాలా మిస్ అవుతున్నా.. ఎమోషనల్ అయిన చరణ్ భార్య!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా, వ్యాపారవేత్తగా ఉపాసన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం అనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన వేర్వేరు పోస్టుల ద్వారా తన ఫ్యాన్స్ తో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.

 Upasana Konidela Emotional On Her Sister Anshupala Details, Anshupala, Emotiona-TeluguStop.com

తన సోదరి అన్షుపాల బర్త్ డే సందర్భంగా ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మెగా కోడలిగా పాపులారిటీ ఉన్న ఉపాసన అపోలో ఆస్పత్రులకు సంబంధించిన బాధ్యతలను సైతం చూసుకుంటున్నారు.

కొన్నిరోజుల క్రితం ఉపాసన సోదరి అన్షుపాలకు ఎంగేజ్ మెంట్, పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.గత నెల 12వ తేదీన ఆర్మాన్ ఇబ్రహీంతో అన్షుపాలకు మ్యారేజ్ జరిగిన తర్వాత అన్షుపాల ప్రస్తుతం భర్తతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.

తన సోదరిని ఎంతగానో మిస్సవుతున్నాననే విషయాన్ని పోస్ట్ ద్వారా ఉపాసన చెప్పుకొచ్చారు.అన్షుపాల నాకు ఎంతో ప్రియమైన సిస్టర్ అని నా సిస్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఉపాసన పేర్కొన్నారు.

అన్షుపాల తనకు నిజమైన ఆత్మబంధువు అని అన్షుపాల తన బలం అని ఉపాసన వెల్లడించారు.

ఈ సంవత్సరం తనను వదిలేసి అన్షుపాల చెన్నైకు వెళ్లిపోయిందని సోదరిని ఎంతలా మిస్ అవుతున్నానో తాను మాటల్లో చెప్పలేనని ఉపాసన పేర్కొన్నారు.అయితే అన్షుపాల సంతోషంగా ఉన్నందుకు తాను హ్యాపీ అని ఉపాసన చెప్పుకొచ్చారు.గొడవ పడిన ప్రతిసారి ఇద్దరం ఎంతో దగ్గరయ్యామని ఉపాసన తెలిపారు.

నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని ఉపాసన పేర్కొన్నారు.ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా చెల్లెలిపై ఉపాసన చూపించిన ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.రామ్ చరణ్ నటుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించడానికి ఉపాసన తన వంతు ప్రోత్సాహం అందిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube