పాలపిట్టలను బ్రతికించండి అంటున్న మెగాస్టార్ కోడలు

తన సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ మధ్య వన్యప్రాణి సంరక్షణ బాద్యతని తీసుకొని దాని కొడం నాడు భిగించిన మెగాస్టార్ కోడలు ఉపాసన ఆ మధ్య భర్త రామ్ చరణ్ తో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో జంతువులతో ఫోటోలు దిగారు.ఇదిలా ఉంటే ఈ మధ్య అంతరించిపోయే స్టేజికి వచ్చిన పక్షులు, జంతువుల మీద దృష్టిపెట్టిన ఉపాసన వీటిపై తన ఫేం ని ఉపయోగించుకొని ప్రజలలో అవగాహనా పెంచడం కోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుంది.

 Upasana Kamineni Konidela Shares Palapitta In Instagram-TeluguStop.com

ఇప్పటికే ఏపీ రాష్ట్ర పక్షి రామచిలుకతో ఫోటో షేర్ చేసి వాటిని బంధించాకండి రక్షించండి అంటూ ప్రచారం చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఉపాషణ తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్టపై ఫోకస్ పెట్టింది.

పాలపిట్ట గురించి అనేక ఆసక్తికర అంశాలను నెటిజన్లతో ఆమె పంచుకుంది.పాలపిట్టను ఇంగ్లీషులో ఇండియన్ రోలర్ బర్డ్ అనే అంటారని, దీని శాస్త్రీయనామం కొరాసియస్ బెంగాలెన్సిస్ అని చెప్పింది.

దీనికున్న నీలి వర్ణం కారణంగా హిందీలో పాలపిట్టను నీల్ కాంత్ అంటారని దసరా వంటి పండుగ సమయాల్లో పాలపిట్టను చూడడం పూజించడాన్ని పవిత్రంగా భావిస్తారని చెప్పింది.ఈ కారణంతోనే పాలపిట్టలను పట్టుకోవడం బంధించడం చేస్తారని చెప్పింది.

ఈ కారణంగా వీటి సంఖ్యలో గణనీయంగా తగ్గిపోయాయని వీటి కాపాడుకోవాలని కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube