బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఉపాసన ఫ్యామిలీ.. సంపద ఎంతంటే?

రామ్ చరణ్ భార్యగా, మంచి మనస్సు ఉన్న వ్యక్తిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపాసన సుపరిచితమనే సంగతి తెలిసిందే.అపోలో హాస్పిటల్స్ కు సంబంధించి కీలక స్థానంలో ఉన్న ఉపాసన ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా పేరును సొంతం చేసుకున్నారు.

 Upasana Family Is Top 100 Billionaires In The Country Details, Interesting Facts-TeluguStop.com

అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అయిన ఉపాసనకు సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

చరణ్ ఉపాసన ఐదు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అపోలో లైఫ్ విభాగానికి వైస్ ఛైర్మన్ గా ఉన్న ఉపాసన సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన డైట్ సీక్రెట్లను వెల్లడించడంతో పాటు ఆరోగ్యం విషయంలో చిట్కాలను అభిమానులతో పంచుకుంటున్నారు.చరణ్ తనకు భర్త కంటే మంచి ఫ్రెండ్ అని ఫిలాసఫర్ అని పలు సందర్భాల్లో ఉపాసన చెప్పుకొచ్చారు.

అయితే అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి అతని కుటుంబం మన దేశంలోని టాప్ 100 బిలియనీర్ల జాబితాలో ఉండటం గమనార్హం.

Telugu Apollo Chairman, Iiflwealth, Prathapa Reddy, Ram Charan, Top, Upasana, Up

ఐ.ఐ.ఎఫ్.ఎల్ తాజాగా వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021ను ప్రకటించగా ఈ జాబితాలో 78వ స్థానాన్ని ప్రతాప్ రెడ్డి ఫ్యామిలీ సొంతం చేసుకున్నారు.ఉపాసన ఫ్యామిలీ సంపద విలువ ఏకంగా 21,000 కోట్ల రూపాయలని తెలుస్తోంది.

ప్రతాప్ సి రెడ్డి సంపాదన ఏకంగా 169 శాతం పెరిగిందని తెలుస్తోంది.

Telugu Apollo Chairman, Iiflwealth, Prathapa Reddy, Ram Charan, Top, Upasana, Up

1983 సంవత్సరంలో అపోలో ఆస్పత్రిని స్థాపించగా ఈ ఆస్పత్రికి అనేక బ్రాంచ్ లతో పాటు ఫార్మసీలు, వైద్య విద్యా కేంద్రాలు ఉన్నాయి.ఈ జాబితాలో కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి 63 మంది బిలియనీర్లు ఉన్నారని అందులో హైదరాబాద్ నుంచి మాత్రమే 56 మంది బిలియనీర్లు ఉన్నారని తెలుస్తోంది.ఉపాసన తన దాతృత్వం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఉపాసన యాక్టివ్ గా ఉంటూ చరణ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube