రామ్ చరణ్ భార్యకి కోపం తెప్పించిన తమన్నా - రకుల్     2016-12-25   22:26:40  IST  Raghu V

రామ్ చరణ్ భార్య ఉపాసన టాలివుడ్ హీరోయిన్లతో బాగా సన్నిహితంగా మెదులుతుంది. తమన్నా, రకుల్ ప్రీత్ తో ఉపాసనకి మంచి దోస్తీ ఉంది. ఈ ముగ్గురు పార్టీల్లో కలిసి కనబడుతుంటారు. ముఖ్యంగా కలిసి టీ తాగడం బాగా అలవాటు అంట ఈ ముగ్గురికి.

మొన్న తమన్నా తన పుట్టినరోజు పార్టీకి టాలివుడ్ సెలబ్రీటిలు చాలామందిని ఆహ్వానించింది. ఎప్పటిలాగే తన బెస్ట్ ఫ్రెండ్స్ ఉపాసన, తమన్నాలకి కూడా ఆహ్వానం వెళ్ళింది. ఎప్పటిలాగే ముగ్గురు కలిసి గ్రీన్ టీ తాగుదాం అనుకున్నారట. కాని రకుల్ – తమన్నా ఉపాసన రాకముందే గ్రీన్ టీ కార్యక్రమం మొదలుపెట్టేసారట.

ఈ విషయం ఉపాసనకి అస్సలు నచ్చలేదని, అయినా సరదాగా ఉందని ఉపాసనని ఆటపట్టించింది రకుల్. అయినా, ఉపాసన కోపంతో ఏం ఊగిపోలేదు లేండి. ఫ్రెండ్స్ అన్నాక ఇలాంటివి కామన్ కదా. సింపుల్ గా రాత్రిపూట చామోమైల్ టీ తాగుదాం కలిసి అంటూ రకుల్ ని అడిగింది. దానికి రకుల్ సరే అని సమాధానమిచ్చింది.