రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana ) పెళ్ళైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిపోయారు.ఇలా ఈ దంపతులు తల్లిదండ్రులగా ప్రమోట్ కావడంతో మెగా కుటుంబంలో ఎంతో సంతోషం వెల్లు విరిసింది.
ఇక మెగా ప్రిన్సెస్ కు క్లీన్ కారా( Klin Kaara ) అనే నామకరణం కూడా చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా చిన్నారి రాకతో ఉపాసన చూసుకుంటూ ఇంటిపట్టును బిజీగా ఉండిపోయారు.
ఇకపోతే ఉపాసన తన కూతురి కోసం ప్రత్యేకంగా తన రూమ్ మొత్తం ఒక ఫారెస్ట్ లాగా డిజైన్ చేయించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా తన చిన్నారి చిన్నప్పటి నుంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరగాలి అన్న ఉద్దేశంతోనే తన కుమార్తె కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అడవిని తలపించే విధంగా ప్రత్యేకంగా డిజైనర్లతో ( designers )తన గదిని మొత్తం డిజైన్ చేయించారని ఉపాసన ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కూతురు ప్రతి ఒక్క విషయంలోను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి ఈమె చిన్నప్పటినుంచి తనని ఎంతో గొప్పగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ప్రత్యేకంగా డిజైనర్లతో తన గదిని మొత్తం డిజైన్ చేయించడానికి ఉపాసన భారీగానే ఖర్చు చేశారని తెలుస్తుంది.ఈ విధంగా ఉపాసన తన గదిని మొత్తం డిజైన్ చేయించడం కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.ఇలా కూతురికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఉపాసన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని చెప్పాలి.ఇక ఉపాసన పెళ్లయిన 11 సంవత్సరాలకు జన్మనివ్వడంతో ఈ చిన్నారిని చూడటం కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరి మెగా ప్రిన్సెస్ దర్శనం ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది.