ఆచార్య సెట్ లో సందడి చేసిన ఉపాసన..

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 Upasana At Acharya Shooting Spot-TeluguStop.com

ఆయన పోషించే పాత్ర నిడివి అరగంట పాటు ఉంటుందని సమాచారం.సైరా సినిమా పెద్ద హిట్ అవ్వకపోవడంతో చిరంజీవి ఈ సినిమా విషయంలో ఎక్కడ తగ్గడం లేదు.

కొంచెం లేటయినా ఎంట్రీ మాత్రం పక్కాగా ఉండాలని కొరటాల శివకు కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

 Upasana At Acharya Shooting Spot-ఆచార్య సెట్ లో సందడి చేసిన ఉపాసన..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరంజీవి 152 వ సినిమాగా ఆచార్య రూపొందుతుంది.

సామజిక దృక్పధంతో కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.రామ్ చరణ్ సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది.ఈ షూటింగ్ లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నాడు.చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

రామ్ చరణ్ అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ తో పాటు, ఇటు ఆచార్య షూటింగ్ కూడా ఒకే సమయంలో పూర్తి చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేసిన కొరటాల శివ ఇప్పుడు ఆ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఆచార్య షూటింగ్ జరిగే అటవీ ప్రాంతానికి వచ్చి సెట్స్ లో సందడి చేసింది.మారేడుమిల్లి గ్రామంలో ఉండే ప్రజలు రామ్ చరణ్, ఉపాసన జంటను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారట.

వారందరికీ అభివాదం తెలిపిన ఉపాసన దేవీపట్నం స్కూల్ లోని పిల్లలతో కొద్దీ సేపు ముచ్చటించింది.అంతేకాదు విద్యార్థులతో సెల్ఫీలు కూడా దిగింది.

#Ram Charan #Acharya #Chiranjeevi #EastGodavari #UpasanaAt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు