ఉపాసన షోలో నవదీప్ డ్రగ్స్ ప్రస్తావన.. అసలు విషయం?

మెగాస్టార్ కోడలు కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమాల్లో నటించకపోయిన ఆ రేంజ్ క్రేజ్ ఉపాసన సొంతం.

 Upasana Announces High On Life With Hero Navdeep, Upasana Konidela, Navadeep, Dr-TeluguStop.com

ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది చెప్తూ ప్రజలకు అవగాహనా కల్పిస్తుంటుంది ఉపాసన.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యువర్ లైఫ్ అంటూ ఓ వెబ్ పోర్టల్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తుంది.

ఇంకా ఈ షో కి ఎంతోమంది సెలబ్రెటీలు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.మొన్నట్టి వరకు అక్కినేని కోడలు సమంత వచ్చి కొన్ని వంటకాలు చేసి వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చెప్పింది.

తర్వాత రష్మిక వచ్చి వంట చేసి వారి సంప్రదాయం.వంటకాలు చేసింది.ఆ వంటకాలతో ప్రయోజనాలు ఏంటో చెప్పి ఆశ్చర్యపరిచింది.ఇక ఇప్పుడు నవదీప్ వచ్చాడు.

మనలో ఎంతోమంది అలవాటు పడుతున్న డ్రగ్స్ గురించి.వాటి గురించి వివరించనున్నాడు.

డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకమో తెలియనిది కాదు.కానీ ఇప్పటికి ఇండియాలో ఎంతోమంది డ్రగ్స్ కు బానిసలయ్యారు.డ్రగ్స్ తీసుకుంటూనే మృతి చెందారు.ఇక అలానే బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయినా సుశాంత్ సింగ్ సైతం మృతి చెందాడు.ఆతర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ స్టోరీ ఏ రేంజ్ వైరల్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.డ్రగ్స్ సరఫరా చేసిందనే బాలీవుడ్ నటి.సుశాంత్ సింగ్ ప్రియురాలైన రియా చక్రవర్తిని అరెస్ట్ అయ్యింది.ఇవి తెలిసిన ఘటనలు తెలియని ఇంకెన్నో.

అందుకే వీటిపై అవగాహనా కల్పించేందుకు నవదీప్.ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కు వచ్చేశాడు.ఉపాసన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ షోలో ‘డ్రగ్స్ అండ్ అడిక్షన్” అంశాన్ని చర్చించనున్నారు.‘హై ఆన్ లైఫ్’ పేరు ఈ అంశంపై చర్చ జరగనుంది.జీవితంలో డ్రగ్స్ కు అడిక్ట్ కావడం మీద న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్ తో కలిసి నవదీప్ తమ సూచనలు, అనుభవాలు ఇవ్వనున్నారు.వ్యసనం అనేది మన మనసుకు సంబంధించిన విషయం దీన్ని అధిగమించేందుకు విలువైన సలహాలు ఇవ్వనున్నారు.

త్వరలోనే ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube