రెండు సింహాలను దత్తత తీసుకున్న మెగా కోడలు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

మెగాస్టార్ కోడలు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు వ్యవహరించడమే కాకుండా మెగా కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మెగా కుటుంబానికి తగ్గ కోడలని ప్రశంసలు అందుకున్నారు.

 Upasana Adopted Two Lions Photos Going Viral, Upasana, Ram Charan, Adopted, Two-TeluguStop.com

ఉపాసన కేవలం తన వృత్తి పరమైన అంశాలపై మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా హెల్త్ కు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకున్నారు.

అలాగే ఈమెకు మూగ జంతువులన్నా ఎంతో ఇష్టమని మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈమె ఇంటిలో ఎన్నో మూగజీవాలను పెంచుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.

వాటికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే తాజాగా ఈమె మూగ జంతువుల పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.ఈ క్రమంలోనే ఉపాసన ఏకంగా రెండు సింహాలను దత్తత తీసుకున్నట్లు తెలియడంతో ఎంతోమంది ఈమెను అభినందించారు.

హైదరాబాద్‏లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకున్నట్లు నెహ్రూ జూలాజికల్ పార్క్ సిబ్బంది వెల్లడించారు.

ఈ పార్క్ లో ఉన్నటువంటి విక్కీ,లక్ష్మీ అనే రెండు సింహాల బాధ్యతలను ఏడాదిపాటు తానే తీసుకోనున్నారు.

ఈ క్రమంలోనే వీటి బాధ్యతలకు సంబంధించి ఉపాసన రెండు లక్షల రూపాయల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‏కు అందించారు.అనంతరం పార్కును పరిశీలించిన అధికారులు అక్కడ జంతువుల పట్ల తీసుకుంటున్న చర్యలు, పరిరక్షణ చూసి వారిపై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పార్కులో సుమారు రెండువేల జంతువుల పరిరక్షణ వారి ఆరోగ్యాన్ని కాపాడటంలోను జూలో జంతువుల పట్ల అధికారులు తీసుకున్నటువంటి పరిరక్షణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అధికారుల పై ప్రశంసలు కురిపించారు.

Telugu Ram Charan, Upasana-Movie

ఈ క్రమంలోని ఈమె రెండు సింహాల బాధ్యతలను తీసుకొని చెక్కును క్యూరేటర్ ఎస్ రాజశేఖర్ కు అందించినట్లు ఆయన వెల్లడిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఉపాసన కొణిదెల మాదిరిగానే మరెంతో మంది ముందుకు వచ్చి జంతువుల బాధ్యతలను తీసుకోవాలని అప్పుడే వాటి మనుగడ కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని ఎస్ రాజశేఖర్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక ఈ సింహాల దత్తత కార్యక్రమంలో భాగంగా Dy.క్యూరేటర్ శ్రీమతి A.నాగమణి , శ్రీ హెచ్.ఎం.హనీఫుల్లా, పి.ఆర్.ఓ పాల్గొన్నారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతోమంది ఒకవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఉపాసన మంచితనం తెలిసి ఆమెను అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube