అదృష్టం అంటే ఇదేనేమో.. గూడ్స్ రైలు కింద మహిళ.. ఆ తరువాత..?!

Up Woman Luckily Saves While Trying To Cross The Goods Rail

మనిషి తీసుకునే కొన్ని తొందర పాటు నిర్ణయాల వల్ల తనకు తానే చిక్కుల్లో పడతాడు.అలాగే కొన్ని సందర్భాల్లో అవే నిర్ణయాలు మరణానికి కూడా కారణలు కావొచ్చు.

 Up Woman Luckily Saves While Trying To Cross The Goods Rail-TeluguStop.com

అయితే ఒక్కో సారి అదృష్టం ఉంటే బతికి బయటపడతారు.కారణం ఏదైనా ఒక అడుగు వేసే ముందు కాస్త ఆలోచించి చేస్తే దాని పరిణామాలు వేరేగా ఉంటాయి.

అయితే ఇదంతా మాకు ఎందుకు అనుకుంటే.పొరపాటే.

 Up Woman Luckily Saves While Trying To Cross The Goods Rail-అదృష్టం అంటే ఇదేనేమో.. గూడ్స్ రైలు కింద మహిళ.. ఆ తరువాత..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక్కడ ఒక మహిళ తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల చిక్కుల్లో పడుతుంది.కానీ అదృష్టం ఉండడంతో బతికి బయటపడుతుంది.

అదెలాగో చూద్దాం.

యూపీ లోని బలియా జిల్లాలోని సురేమన్ పూర్ రైల్వే స్టేషన్ లో పట్టాల మీదుగా గూడ్సు రైలు వెళ్తోంది.

సిగ్నల్ అందని కారణంగా పట్టాల పై ఆ గూడ్సు రైలు నిలిపి ఉంది.అయితే ఇంతలోపే ఒక మహిళ ఆవలి వైపునకు త్వరగా వెల్లేందుకు ప్రయత్నించింది.

దాని కోసం ఆగి ఉన్న గూడ్సు రైలు కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది.ఇంతలో ఉన్నట్టుండి గూడ్సు రైలు ముందుకు కదిలింది.

పట్టాలపైన ఉన్న ఆమెను గమనించిన గేట్ మ్యాన్ గట్టిగా అరుస్తూ.ఆమెను పట్టాలపై పడుకోమని సూచించాడు.

ఆమె అలానే చేయడంతో రైలు ఆమె మీదుగా వెళ్ళిపోయింది.ఈ సంఘటన చూసిన అక్కడున్న వారంతా ఏమి జరుగుతుందోనని ఒక్కసారిగా భయంతో వణికి పోయారు.

అదృష్టం బాగుంది కాబట్టి రైలు వెళ్ళిపోయాక ఆమె మెల్లగా లేచి నిలుచుంది.దీంతో అక్కడి వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈమె తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుంది.అదృష్టం బాగుంది కాబట్టి బతికి బయటపడింది.లేకపోతే ఆలోచించడానికే భయం వేస్తోంది.దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

#Luckily #Track #Goods Rail #Goods Rail #Goods Train

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube