అక్కకి సాయం చెయ్యాలని వచ్చి బావతో సరసాలు చివరికి...   

up wife sysister faziabad - Telugu Husband, Husband Killed Her Wife, Husband Latest News, Husband News, Uttar Pradesh, Uttar Pradesh Crime News, Uttar Pradesh Latest News, Uttar Pradesh News

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు కారణంగా కొంతమంది ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు.అంతేగాక వావివరుసలు మరచి కూడా ప్రవర్తిస్తున్నారు.

TeluguStop.com - Up Wife Sysister Faziabad

ఓ వ్యక్తి తన భార్య గర్భంతో ఉండగా తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను దక్కించుకోవడానికి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఘటన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ఫజియాబాద్ ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు.

అయితే తాజాగా మహిళ గర్భం దాల్చింది.దీంతో గర్భవతి అయినటువంటి ఆ మహిళకి సాయంగా ఉండేందుకు తన చెల్లెలు ఆ దంపతుల ఇంటికి వచ్చింది.

అయితే భార్య గర్భంతో ఉండటంతో శృంగారం చేయకూడదని వైద్యులు చెప్పారు.దీంతో కామవాంఛలతో రగిలి పోతున్నటువంటి అతడు తన మరదలుపై కన్నేశాడు.

దీంతో ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని పన్నాగం పన్నాడు.

అయితే ఇందులో భాగంగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు.అయితే తన మరదలి మోజులో పడ్డ అతడు తన భార్యని మరియు పుట్టబోయే బిడ్డను కూడా హత మారిస్తే తన మరదలు ఇక జీవితాంతం తన సొంతమవుతుందని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా డబ్బులు తీసుకొని హత్యలు చేసేటువంటి ఓ ముఠా కి తన భార్యను చంపే పని అప్పగించాడు.

దీంతో ఆ ముఠా సభ్యులు కొంతమంది ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి అతని భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.

అయితే అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు నమోదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా  వారి అల్లుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అంగీకరించాడు.

 అలాగే ఈ నేరాన్ని చేసినటువంటి ముఠా సభ్యుల వివరాలు కూడా తెలపడంతో ఆ హంతకులు కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

#Husband #UttarPradesh #Uttar Pradesh #HusbandLatest #HusbandKilled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు