ఉరి తీసే నాటకం రిహార్సల్.. చివరికి దారుణం..

యువతకు స్ఫూర్తిప్రదాత భగత్ సింగ్. భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు.

 Bhagat Singh Life Story, Independence Day, Rehearsals, Rehorsal, Student Death,-TeluguStop.com

కాగా, అంత గొప్ప యోధుడి చరిత్రను నేటి తరానికి తెలిపేందుకుగాను చేసిన ఓ ప్రయత్నం విషాదకరంగా మారింది.ఇంతకీ ఏం జరిగిందంటే.

భగత్ సింగ్ స్ఫూర్తిని నేడు ప్రతీ భారతీయుడిలో కలగజేయాలని పెద్దలు చెప్తుంటారు.ఈ క్రమంలోనే ఆయన చరిత్రను తెలిపేందుకు కథలు చెప్తుంటారు.

భగత్ సింగ్ లైఫ్‌పై సినిమాలు కూడా వచ్చాయి.ఈ క్రమంలో భగత్ సింగ్ వంటి యోధుడి నాటకం వేద్దామనుకున్నాడు ఓ తొమ్మిదేళ్ల బాలుడు.

ఇందుకు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే నేపథ్యం అని అనుకున్నాడు.ఉత్తర‌ప్రదేశ్, బుదౌన్ జిల్లాలోని బబత్ గ్రామ పాఠశాలకు చెందిన శివమ్ అనే స్టూడెంట్, అతడి ఫ్రెండ్స్ భగత్ సింగ్ నాటకం వేయాలని అనుకున్నారు.

ఈ నాటకంలో భగత్ సింగ్ పాత్రను తానే వేస్తానని శివమ్ చెప్పాడు.ఇందుకు మిగతా ఫ్రెండ్స్ ఒప్పుకోగా, రిహార్సల్స్ స్టార్ట్ చేశారు.

అలా శివమ్ భగత్ సింగ్‌గా మారిపోయాడు.నాటక సీన్ రిహార్సల్స్ కోసం పాఠశాలకు వెళ్లాడు.

అక్కడ చివరి సీన్ అయిన ఉరికొయ్యకు వేలాడటం ప్రాక్టీస్ చేద్దామనుకున్నాడు.స్టూల్ సాయంతో పాఠశాలలోని ఓ గదిలో తాడును కట్టాడు.

భగత్ సింగ్ మాదిరి అనుకరిస్తూ ఉరికొయ్యకు వేలాడుదామని స్టూల్‌పైకి ఎక్కగా, అనుకోకుండా దాని మీద నుంచి జారాడు.తాడు మెడకు బిగుసుకుని ఉరిగా మారింది.

అయితే, శివమ్ ఫ్రెండ్స్ అతడిని చూసి యాక్టింగ్ అనుకున్నారు.కానీ, క్షణాల్లోనే అతడు చనిపోయాడు.

చివరకు వారి వెళ్లి యాక్టింగ్ చాలు ఇక లే అని చెప్తే శివమ్ లేవకపోవడంతో పిల్లలు భయపడిపోయారు.ఈ విషయం తల్లిదండ్రులకు తెలపగా, వారి వచ్చే చూసే శివమ్ ప్రాణం కోల్పోయి విగతజీవిగా పడి ఉన్నాడు.

తల్లిదండ్రులు, శివమ్ ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతం కాగా, వారి ఏడుపులు విని అక్కడున్న వారి హృదయాలు ద్రవించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube