యోగి సర్కార్ సంచలనం... 11 వేల మంది ఖైదీలు విడుదల

కరోనా దేశవ్యాప్తంగా జడలు విప్పుతుంది.యూపీ, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

 Up Sarkar Release 11000 Prisoners Due To Corona, Covid-19, Supreme Court, Lock D-TeluguStop.com

కరోనా కట్టడి చేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి.అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకి వేసి యూపీలో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 71 జైళ్లలో నుంచి 11,000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్టు అధికార ప్రకటన విడుదల చేసింది.ఏడేళ్లు, అంతకంటే తక్కువ కాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 11 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది.

జైళ్ళులో ఖైదీలు గుంపులుగా ఉంటారు.ఒకరికి కరోనా వచ్చిన అది మొత్తం ఖైదీలు అందరి మీద ప్రభావం చూపిస్తుంది.ఈ నేపధ్యంలోనే 7 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ శిక్ష అనుభవించిన దోషులను వ్యక్తిగత పూచీకత్తుతో 8 వారాల పెరోల్‌పై విడుదల చేయాలని, వెంటనే జైళ్ల నుండి విముక్తి పొందాలని అని ఒక ప్రకటనలో పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం, రాష్ట్ర జైళ్లలో సుమారు 8,500 అండర్ ట్రయల్స్ మరియు 2,500 మంది దోషులు ఉన్నారు.

ఇక అందులో 11,000 మంది ఖైదీలను విడిపించే పని ప్రారంభమైంది.అయితే విడుదల చేసిన ఖైదీలు అందరి మీద నిఘా ఉంటుందని, వారు తప్పించుకొని ఎక్కడికి వెళ్లలేరని కూడా ప్రకటించింది.

మరి యూపీ సర్కార్ దారిలో ఎన్ని రాష్ట్రాలు వెళ్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube