వామ్మో ఈయ‌న మామూలు వ్య‌క్తి కాదుగా.. ఏకంగా 60 పూరీల‌ను తినేశాడు..

ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో ప్రతీ రోజు రకరకాల కొత్త కొత్త చాలెంజెస్ తెరమీదకు వస్తుంటాయి.నెటిజన్లు ఆయా చాలెంజెస్‌లో పార్టిసిపేట్ చేస్తుంటారు.

 Up Police Officer Eating 60 Puri In Bada Khana Competition, 60 Puri, Bada Khana-TeluguStop.com

తర్వాత వాటిని పక్కన పెట్టేస్తుంటారు.అలా ఇప్పటికే రకరకాల చాలెంజెస్ వచ్చాయి.

సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ కూడా ఇందులో భాగస్వాములవుతుంటారు.ఈ క్రమంలోనే ఓ డిఫెరెంట్ ఫుడ్ చాలెంజ్ పెట్టారు పోలీసులు.

అందులో ఓ కానిస్టేబుల్ సూపర్బ్ రికార్డు క్రియేట్ చేశాడు.ఇంతకీ ఆ చాలెంజ్ ఏమిటంటే.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని గొండా రిజ‌ర్వ్ పోలీస్ లైన్‌లో ఇటీవల హెవీ ఫుడ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు.ఇందులో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్ చాలెంజ్ నెగ్గి.

ఔరా అనిపించాడు.పోటీలో భాగంగా ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.

అరవై పూరీలను సునాయాసంగా తినేశాడు.అలా 60 పూరీలను సదరు కానిస్టేబుల్ తినడం చూసి అక్కడున్న వారు , ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయి ముక్కున వెలేసుకున్నారు.

పాసింగ్ అవుట్ పరేడ్ కు ముందర యూపీ పోలీసు ఉన్నతాధికారులు నూతన రిక్రూటర్లు, ఉద్యోగులకు కలిపి ఈ చాలెంజ్ విసిరారు.అందులో హెడ్ కానిస్టేబుల్ పాల్గొని రికార్డు క్రియేట్ చేశాడు.హృషీకేష్ రాయ్ గతంలో ఒకేసారి 52 పూరీలు తిని రికార్డు సృష్టించాడు.ఇప్పుడు మళ్లీ తన రికార్డును తాను బద్ధలు కొట్టాడు.ఒకేసారి ఏకంగా 60 పూరీలు లాగించేసి శభాష్ అనిపించుకున్నాడు.ఇక ఈ ఫుడ్ చాలెంజ్‌లో గెలుపొందిన కానిస్టేబుల్‌ రాయ్‌ని పోలీస్‌ ఉన్నతాధికారులు సత్కరించారు.

కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్ మామూలు వ్యక్తి కాదని, వెరీ డిఫరెంట్ పర్సన్ అని ఈ సందర్భంగా కొందరు కొనియాడారు.ఇకపోతే ఇలా 60 పూరీలను తినడం ఈజీనేనని, ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా తినొచ్చని కానిస్టేబుల్ చెప్పారు.

https://twitter.com/gondapolice/status/1478293670696665089?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1478293670696665089%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Futtar-pradesh-police-constable-eating-60-puri-in-bada-khana-competition-post-goes-viral-on-social-media-613140.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube