గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై వారణాసిలో కేసు, కారణమిదే..!!

టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కించపరిచేలా వున్న ఓ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దీనిపై పిచాయ్ సహా 17 మందిపై వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 Up Cops File Case Against Google's Sundar Pichai, Then Drop His Name, Google's S-TeluguStop.com

అయితే ఆ వెంటనే ఎఫ్ఐఆర్ నుండి వారి పేర్లను తొలగించినట్లు పోలీసులు తెలిపారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త కలకలం రేపుతోంది.
ఈ కేసుతో సంబంధం లేదని తేలిన తరువాత సుందర్ పిచాయ్ సహా గూగుల్‌కు చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు.ఎఫ్ఐఆర్‌‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం… వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై అభ్యంతరం తెలిపినందుకు వారణాసికి చెందిన ఓ వ్యక్తికి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

దాదాపుగా 8,500 సార్లు ఆగంతకులు అతనికి ఫోన్ చేసి బెదిరించారు.దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Telugu Googlessundar, Hash Tag, Pm Modi, Drop, Copsgoogles, Varanasi-Telugu NRI

అతని ఫిర్యాదు మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ సహా మరో ముగ్గురు ఉన్నతాధికారులపై పోలీసులు ఫిబ్రవరి 6న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ వీడియోను ఘాజీపూర్‌కు చెందిన పలువురు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు.ఇందుకు సంబంధించి లోకల్ మ్యూజిక్ గ్యాంగ్, రికార్డింగ్ స్టూడియోలను ఎఫ్ఐఆర్‌లోకి చేర్చారు.ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

కాగా, రైతుల ఆందోళనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ మధ్య కొందరు ప్రధాని మోడీ పేరిట ‘రైతు హత్యలకు కుట్ర’ అంటూ హాష్ట్యాగ్లు క్రియేట్ చేశారు.

ఆ అకౌంట్లతో పాటు ఖలిస్థానీ గ్రూపులతో సంబంధాలున్న వెయ్యికి పైగా అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది.దానికి సంబంధించి ట్విట్టర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

పైగా భారత ప్రభుత్వ ఆదేశాలు.దేశ చట్టాలతో సంబంధం లేకుండా ఉన్నాయంటూ ట్విట్టర్ మండిపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube