అత్తపై పోలీసులకు కోడలు ఫిర్యాదు.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?

సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య చిన్నచిన్న గొడవలు ఉంటాయనే సంగతి తెలిసిందే.కట్నం కోసం అత్త వేధింపులకు గురి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడళ్ల గురించి మనం వినే ఉంటాం.

 Up Mother In Law Did Not Cook After Watching Tv Serials The Daughter In Law Called Police-TeluguStop.com

అయితే యూపీలోని ఒక కోడలు మాత్రం అత్తపై వింత కారణంతో ఫిర్యాదు చేసింది.అత్త వేడివేడి అన్నం పెట్టడం లేదని చేసిన ఫిర్యాదు నెట్టింట వైరల్ కావడంతో పాటు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

ఈ ఫిర్యాదు చేసిన కోడలి గురించి తెలిసి నెటిజన్లు ఇలాంటి కోడళ్లు కూడా ఉంటారా.? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని మంజ్ గన్వా అనే ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఒక కుటుంబంలో అత్త, కోడలు, వాళ్ల భర్తలు నివాసం ఉంటున్నారు.వాళ్ల భర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండగా కోడలు అత్త తనకు వేడిగా ఉన్న అన్నం వడ్డించడం లేదని ఫిర్యాదు చేసింది.

 Up Mother In Law Did Not Cook After Watching Tv Serials The Daughter In Law Called Police-అత్తపై పోలీసులకు కోడలు ఫిర్యాదు.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Cook After, Daughter In-law, Hot Food, Mother In Law, Netizens, Not Served, Police, Police Counselling, Rice, Social Media, Tv Serials, Up Mother In Law, Uttarpradesh, Viral News-Latest News - Telugu

ఈ వింత ఫిర్యాదు గురించి తెలిసిన పోలీసులు మొదట్లో ఆశ్చర్యపోయారు.హెల్ప్ లైన్ నంబర్ ద్వారా కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అత్త సీరియళ్లు చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తోందని ఆ కారణం వల్ల కోడలికి పాడైపోయిన ఆహారం ఇస్తుందని వెల్లడైంది.అయితే అత్త మాత్రం కోడలు తనపై లేనిపోని ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది.

కోడలికి వంట రాదని.

తనకు వంట పనుల్లో కోడలు ఎటువంటి సహాయం చేయదని వెల్లడించింది.పోలీసులు అత్తాకోడళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నచిన్న విషయాలకు ఫిర్యాదు చేయవద్దని సూచనలు చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు అత్తాకోడళ్లకు సూచనలు చేశారు.అత్తాకోడళ్లు వంట విషయంలో ఒకరి గురించి మరొకరు ఫిర్యాదు చేసుకోవడం గమనార్హం.

#Mother #Served #Mother #Uttarpradesh #Tv

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు