యూపీ మంత్రి కి కరోనా పాజిటివ్  

UP minister Chetan chauhan tested corona positive, UP minister Chetan chauhan, corona positive - Telugu Corona Positive, Up Minister Chetan Chauhan, Up Minister Chetan Chauhan Tested Corona Positive

ఉత్తరప్రదేశ్ క్రీడా మంత్రి,మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.చౌహాన్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రి, సైనిక్ వెల్ఫేర్, హోమ్ గార్డ్స్, పిఆర్డి మరియు సివిల్ సెక్యూరిటీ విభాగాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Up Minister Chetan Chauhan Tested Positive

ఆయన నౌగవాన్ సదాత్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే.ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 33,000 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా,మరణాల సంఖ్య 900 కి దగ్గరగా ఉంది.

కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆయన హజ్రత్‌గంజ్‌లోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.దీనితో వెంటనే ఆయన సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

యూపీ మంత్రి కి కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆయనకు ఈ వైరస్ ఎలా సోకింది అన్న విషయం మాత్రం తెలియరాలేదు.అయితే చౌహన్ కు కరోనా పాజిటివ్ రావడం తో ఆయన కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు తరలించడమే కాకుండా వారందరికి కూడా కరోనా టెస్ట్ లు చేయనున్నట్లు తెలుస్తుంది.

మాజీ క్రికెటర్ అయిన చౌహన్ కు కరోనా పాజిటివ్ రావడం తో దేశం నుంచి ఈ వైరస్ బారిన పడిన మొదటి అంతర్జాతీయ క్రికెటర్ గా ఆయన నిలిచారు.

ఇప్పటి వరకు పొరుగుదేశాల్లో పాకిస్థాన్ నుంచి అనేక అంతర్జాతీయ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.73 ఏళ్ల చౌహన్ కు కరోనా పాజిటివ్ రావడం తో పలువురు క్రికెటర్లు ఆయన ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

#Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Up Minister Chetan Chauhan Tested Positive Related Telugu News,Photos/Pics,Images..