భార్య కోసం 30 సంవత్సరాలుగా పెళ్లికూతురు గెటప్ లో తిరుగుతున్న భర్త.. ఎందుకో తెలుసా ?

భార్య కోసం ఒక భర్త ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సంవత్సరాలుగా పెళ్లి కూతురు గెటప్ వేసుకుని ఆ ఊర్లో తిరుగుతున్నాడు.ఎందుకు.? ఈయనకు ఏమైనా పిచ్చి పట్టిందేమో అని అనుకుంటున్నారా.కాదు.

 Up Man To Stay Dressed As Bride For 30 Years-TeluguStop.com

ఈయన కథ విన్నారంటే మీకే అర్ధం అవుతుంది.ఎందుకు ఈయన పెళ్లి కూతురులా తయారయ్యి 30 సంవత్సరాలుగా ఊర్లో తిరుగుతున్నాడో అని.అది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.జలాల్ పూర్ గ్రామానికి చెందిన చింతహరన్ చౌహన్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా రోజూ పెళ్లి కూతురులా తయారవుతున్నాడు.

 Up Man To Stay Dressed As Bride For 30 Years-భార్య కోసం 30 సంవత్సరాలుగా పెళ్లికూతురు గెటప్ లో తిరుగుతున్న భర్త.. ఎందుకో తెలుసా -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనని తాను అందంగా అలంకరించు కుంటున్నాడు.కానీ ఇలా ప్రవర్తించడానికి ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలే కారణం అని ఈయన చెడుతున్నాడు.

చింతహరన్ 21 సంవత్సరాల వయసులోనే మొదటి భార్య చనిపోవడంతో అతడు పశ్చిమ బెంగాల్ లో ఇటుకల బట్టీలో పనిచేసేందుకు అక్కడకు వెళ్ళాడు.అక్కడ ఒక షాప్ యజమాని కూతురుతో ప్రేమలో పడడంతో ఆమెను నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు.

కానీ ఈ పెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేక పోవడంతో ఆమెను వాళ్ళ ఇంట్లోనే వదిలేసి చింతహరన్ తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు.

చింతహరన్ వెళ్లిపోవడంతో ఆమె తనని మోసం చేసి వెళ్లిపోయాడని ఆత్మహత్య చేసుకుని మరణించింది.ఈ విషయం చింతహరన్ కు తర్వాత తెలిసింది.అయితే ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు బలవంత పెట్టడంతో చింతహరన్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.

అప్పటి నుండే తనకు కష్టాలు మొదలయ్యాయి.

మూడవ పెళ్లి జరిగిన కొంత కాలానికే అతడు తీవ్ర అనారోగ్య పాలయ్యాడు.

ఆ తర్వాత తన కుటుంబంలోని వ్యక్తులు ఒక్కొక్కరిగా చనిపోవడం మొదలయ్యింది.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది వరకు కుటుంబ సభ్యులు మరణించారు.

చౌహన్ తండ్రి, అన్నయ్య, భార్య, కొడుకులు, తమ్ముడు, సోదరుడి నలుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు చనిపోయారు.

అతడికి రోజు తన రెండవ భార్య కలలో కనిపించి నా మరణానికి కారణం నువ్వే, నువ్వు మోసం చేయడం వల్లే నేను ఆత్మహత్య చేసుకున్నానని చెబుతూ గట్టిగా ఏడ్చిందట.

దీంతో అతడు కలలోనే ఆమెను క్షమించమని నా కుటుంబాన్ని వదిలిపెట్టమని కోరడంతో ఆమె పెళ్లి బట్టలు వేసుకుని ఆమెను నాతో పాటు ఉంచుకోవాలని చెప్పిందట.

దీంతో నేను అప్పటి నుండి రోజూ పెళ్లి దుస్తులలోనే ఉంటున్న.

ఆ తర్వాత నేను అనారోగ్యం నుండి కోలుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను.అంతేకాదు నా కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం నుండి బయటపడ్డారు.

నన్ను చూసి ఎవ్వరు నవ్వినా పట్టించుకోను ఎందుకంటే నేను నా కుటుంబం కోసం ఈ పని చేస్తున్న అని చౌహన్ తెలిపాడు.

#Uttar Pradesh #ManDresses #UpMan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు