శహభాష్‌ మాన్వీ.... లేడీ కానిస్టేబుల్‌ చేసిన పనికి డీజీపీ నుండి ప్రశంసలు

ఆడవారికి ముఖ్యంగా అమ్మాయిల మనసు చాలా సున్నితంగా ఉంటుంది, వారు ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు, వారు ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు ఆసక్తి చూపించరు.ఇది అందరు అమ్మాయిల విషయంలో నిజం కాకపోవచ్చు, కాని ఎక్కువ శాతం అమ్మాయిలు ఇలాగే ఉంటారు.

 Up Dgp Lauds Woman Constable For Assisting Old Woman-TeluguStop.com

తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితం అయ్యింది.ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

లేడీ కానిస్టేబుల్‌ మాన్వీ ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యింది.ఆమె గురించి ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు.

ఇంతకు మాన్వీ ఏం చేసిందో తెలుసా…

ఉత్తర ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌లోని ఒక పీసీలో కానిస్టేబుల్‌గా చేస్తోంది.మాన్వీ డ్యూటీలో భాగంగా ధంగాటా ప్రాంతంలోని ఒక బ్యాంక్‌ వద్ద మాన్వీ డ్యూటీ పడింది.

మామూలుగా పోలీసులు డ్యూటీ అంటే కుర్చీ వేసుకుని కూర్చుని, ఫోన్‌ చూసుకుంటూ ఉంటారు.కాని మాన్వీ మాత్రం అలా కాదు, బ్యాంకుకు వచ్చి, సాయం కోసం ఎదురు చూస్తూ, తమ పని తాము చేసుకోలేక పోయే వారికి సాయం చేస్తుంది.

తాజాగా ఒక ముసలి అవ్వ బ్యాంకుకు వచ్చింది.ఆమెకు అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కావడం లేదు.దాంతో ఆమెకు కావాల్సిన సాయం చేయడం జరిగింది.

అవ్వకు బ్యాంకులో డబ్బులు తీసుకోవడంలో సాయం చేయడంతో పాటు, ఆమె కడుపు నింపింది.బ్యాంకులో పని పూర్తి అవ్వగానే వదిలేయకుండా, తన విధులను పూర్తి చేసుకుని లంచ్‌ సమయంలో ఆ అవ్వను తీసుకుని ఇంటికి వచ్చి, ఇంటి వద్ద ఆమెకు అన్నం పెట్టి ఆ తర్వాత ఆమె ఎక్కడకైతే వెళ్లాలో అక్కడకు పంపించింది.అవ్వకు మాన్వీ చేసిన సాయంను ఆమె స్నేహితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఆ పోస్ట్‌ కాస్త వైరల్‌ అయ్యి యూపీ డీజీపీ వద్దకు వెళ్లింది.పోలీసు శాఖ నిన్ను చూసి గర్విస్తుంది, జనాలతో మంచిగా ఉండి, మంచి పోలీస్‌ అంటూ పేరు తెచ్చుకున్నందుకు అభినందనలు అంటూ డీజీపీ ఆఫీస్‌ నుండి మాన్వీకి లేఖ అందింది.

మొత్తానికి మాన్వీ తన మానవత్వంను చాటుకోవడంతో స్టార్‌ అయ్యింది.మీరు తప్పకుండా మీలో ఉన్న మానవత్వంను చాటుకోండి.

ఒకసారి కాకుంటే ఒకసారి అయినా మీకు గుర్తింపు దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube