కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించండి.... సోనియా కు మరో ఘాటు లేఖ

కాంగ్రెస్ పార్టీ లో వారసత్వ రాజకీయాలు పక్కన పెట్టి వేరే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ క్రియాశీలక, పూర్తి కాలపు నాయకుడు కావాలి అని ఇటీవల 23 మంది సీనియర్లు లేఖ రాసి కాక పుట్టించిన సంగతి తెలిసిందే.దీనితో అటు సోనియా,ఇటు రాహుల్ లు ఇద్దరూ కూడా సీనియర్స్ పై మండిపడడం దానికి వారు గుర్రుగా ఉండడం ఇలా జరిగిపోయింది.

 'rise Above Affinity For The Family', Say Expelled Up Congress Leaders To Sonia,-TeluguStop.com

అయితే ఇంకా ఈ ఘటన గురించి చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో లేఖ వివాదం రేపింది.కాంగ్రెస్ బహిష్కృత నేతలు ఈ సారి నేరుగా సోనియా టార్గెట్ చేస్తూ లేఖ రాశారు.

యూపీ కాంగ్రెస్ బహిష్కృత నేతలు ‘‘కుటుంబ అనుబంధాలను దాటి ఆలోచించండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ లు కాంగ్రెస్‌ను నిర్మించి దేశంలో ప్రజాస్వామ్య పునాదులు వేశారు.

కానీ కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది అంటూ బహిష్కృత నేతలైన సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.బహిరంగ వేదికలలో పార్టీని తూలనాడటం, పార్టీపై విమర్శలు చేయడం, పార్టీ ఇమేజ్‌ను దెబ్బ తీయడం లాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన పది మంది నేతలను అధిష్ఠానం బహిష్కరించింది.

ఆ పది మందిలో సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి నేతలు కూడా ఉన్నారు.

ఈ క్రమంలోనే బహిష్కృత నేతలు అయిన వారిరువురు డైరెక్ట్ గా సోనియా ను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు.

కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించండి, దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్ సజీవంగా, ధృఢంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube