ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కోసం యోగి ప్రచారం! అయిన బీజేపీ అగమ్యగోచరం  

నేడు తెలుగు రాష్ట్రాలలో యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం. .

Up Cm Yogi Campaign For Bjp In Ap-campaign For Bjp,janasena,tdp,up Cm,yogi,ysrcp

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ప్రభావం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఇక్కడ అయితే కాంగ్రెస్, లేదంటే ప్రాంతీయ పార్టీల హవా మొదటి నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు తెలుగు రాష్ట్రాలలో ఉంది..

ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కోసం యోగి ప్రచారం! అయిన బీజేపీ అగమ్యగోచరం-UP CM Yogi Campaign For BJP In AP

కాని బీజేపీ పార్టీ మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో బలపడే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. దీంతో ఆ పార్టీకి ఇక్కడ సొంత క్యాడర్ లేకుండా పోయింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఓ నాలుగు, ఐదు సీట్లు వరకు తెచ్చుకోగలుగుతుంది.

ఇదిలా ఉంటే ఈ సారి ఏపీలో బీజేపీ తప్పని సరి పరిస్థితిలో ఓటరిపోరుకి దిగుతుంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన ఏ సారి కూడా ఆ పార్టీ నేతలకి డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఏపీలో బీజేపీ నామమాత్రంగానే ఉంది.

దాని ప్రభావం ఉండబోదు అనే విషయం స్పష్టం అయిపొయింది. పోటీ ప్రధాన పార్టీలతో పాటు, మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన మధ్యనే అని ఫిక్స్ అయిపొయింది. ఇలాంటి వేళ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన, ఇక ఏ నాయకులు వచ్చిన ఓటర్స్ ని మాత్రం ప్రభావితం చేయలేరు అని సుస్పష్టం.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఏపీలో పర్యటించారు. అతని పర్యటన సమయంలో కొంత ఉత్సాహంగా కనిపించిన పార్టీ అభ్యర్ధులు వెళ్ళిపోయినా తర్వాత మరల ఎన్నికల ప్రచారంలో అంతంత మాత్రంగానే ఉన్నారు. తాజాగా యూపీ ముఖ్యమంత్రి, భావి ప్రధానిగా బీజేపీలో చెప్పబడుతున్న యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు చిత్తూరు జిల్లాలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మోడీతో పోల్చుకుంటే యోగికి ఏపీలో కొంత సానుకూలత ఉంది.

మరి యోగి ప్రచారం అయిన బీజేపీ పార్టీకి లాభిస్తుందో లేదో వేచి చూడాలి.