దారుణం : పెళ్లి వద్దు చదువుకుంటానన్న కూతురును తండ్రి ఏం చేశాడో తెలిస్తే కన్నీరు ఆగవు  

Up 15 Year Old Girl Attacked With Knife By Father -

ప్రపంచం కంప్యూటర్‌ యుంగంగా మారిపోయింది.అంతా కూడా ఒకరిని చూసి ఒకరు ముందుకు పరిగెత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇంకా వెనుకబడే ఉంటామని అంటున్నారు.

Up 15 Year Old Girl Attacked With Knife By Father

మారుతున్న ప్రపంచంతో మారాలనే ఆలోచన వారికి కలగడం లేదు.అసలు మారాలని వారు కోరుకోవడం లేదు.

ఎందుకు వారు అలా ప్రవర్తిస్తున్నారనే విషయం వారికి అయినా అర్ధం అవుతుందో లేదో వారికే తెలియాలి.ఒక అమ్మాయి చదువుకుంటాను అంటూ ఆమె కన్న తండ్రి కత్తితో పొడిచిన ఘటన యూపీలో జరిగింది.

దారుణం : పెళ్లి వద్దు చదువుకుంటానన్న కూతురును తండ్రి ఏం చేశాడో తెలిస్తే కన్నీరు ఆగవు-General-Telugu-Telugu Tollywood Photo Image

అక్కడ పరిస్థితికి ఈ సంఘటన అద్దం పడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.ఒక కాలువ కట్టపై 15 ఏళ్ల బాలికకు మరియు ఆమె తండ్రికి వాగ్వివాదం జరుగుతుంది.

తండ్రి పెళ్లి సంబంధం తీసుకు వచ్చాడు.పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని భావిస్తున్నాడు.

కాని ఆ బాలిక మాత్రం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన చదువు కొనసాగిస్తానంటూ తండ్రితో తెగేసి చెప్పింది.మొదట బతిమిలాడిన ఆ తండ్రి ఆ తర్వాత ఆగ్రహంతో రగిలి పోయాడు.

కోపంతో అతడు కూతురు అనే విషయాన్ని చూడకుండా పిడి గుద్దులు గుద్డాడు.ఆ తర్వాత పాకెట్‌లో ఉన్న కత్తిని తీసి విచక్షణ రహితంగా పొడిచాడు.

పలు చోట్ల పొడిచిన అతడు పక్కనే ఉన్న కాలువలో ఆమెను తోసేయడం జరిగింది.ఈదడం వచ్చిన ఆ బాలిక మెల్ల మెల్లగా ఈదుకూంటూ కొద్ది దూరం వెళ్లి పైకి ఎక్కింది.రక్తం కారుతున్న గాయాలతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లింది.వెంటనే ఆమెను హాస్పిటల్‌లో జాయిన్‌ చేసిన పోలీసులు ఆమె నుండి వాంగ్మూలం సేకరించి కేసు నమోదు చేయడం జరిగింది.

ఆ బాలిక తండ్రిపై హత్య కేసును నమోదు చేసి విచారణ ఎంక్వౌరీ ప్రారంభించారు.మరో వైపు హాస్పిటల్‌లో అమ్మాయికి చికిత్స చేయిస్తున్నారు.ఆమె మెల్ల మెల్లగా కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Up 15 Year Old Girl Attacked With Knife By Father- Related....