బాత్రూమ్స్ కడిగిన వ్యక్తి ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.కష్టపడి పని చేసుకుంటూ పోతే ఎలాంటి వారైనా జీవితంలో సక్సెస్ కావచ్చు.

 Untold Struggles Of Jabardasth Comedian Venu Details, Venu, Comedian Venu, Jabar-TeluguStop.com

ఇందుకు మన కళ్ళ ముందు చాలా ఉదాహరణలు ఉంటాయి.సినీ పరిశ్రమలో ఇలా కష్టపడి పైకి వచ్చిన వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు.

కమెడియన్ వేణు కూడా ఇదే కోవకి చెందుతాడు.సినిమాల మీద పిచ్చితో.

ప్రొడక్షన్ హౌస్ లలో ఆఫీస్ బాయ్ గా పని చేసే స్థితి నుండి వేణు ప్రస్థానం మొదలయింది.ఇప్పుడు వేణు తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నాడు.

కానీ., ఈ మొత్తం ప్రయాణంలో వేణు ఎలాంటి కష్టాలు పడ్డాడో ఇప్పుడు తెలుసుకుందాం.

వేణు అంటే అందరికీ ముందుగా జబర్దస్త్ గుర్తుకు వస్తుంది.జబర్దస్త్ షో మొదలైనప్పుడు వేణు టీమ్ చాలా ముఖ్యమైంది.

వేణు వండర్స్ టీమ్ అప్పట్లో చాలా పెద్ద టీమ్.ఆ ప్లాట్ ఫామ్ వేణుకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కానీ., వేణు అంతకన్నా ముందే చాలా సినిమాల్లో నటించాడు.

అసలు వేణు హైదరాబాద్ కి వచ్చిందే సినిమాలలో నటించడానికి.

హైదరాబాద్ కు వచ్చి సెట్ బాయ్ గా కూడా పని చేశాడు.అతడికి దానికిగాను రోజుకి రూ.70 ఇచ్చేవారట.

Telugu Auto Ram Prasad, Bath Rooms, Venu, Venu Struggles, Jabardasth Venu, Srinu

దాని తరువాత దర్శకులకి దగ్గర అవ్వడానికి ఆఫీస్ బాయ్ గా కూడా పని చేశాడు.ఆ సమయంలో వాళ్ల బాత్రూమ్ లు కడుగడమే కాకుండా వాళ్లు తిన్న కంచాలు కూడా కడిగానని వేణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.అలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చివరకు జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు వేణు.

Telugu Auto Ram Prasad, Bath Rooms, Venu, Venu Struggles, Jabardasth Venu, Srinu

జబర్దస్త్ కోసం కూడా వేణు ఇలానే చాలా కష్టాలు పడ్డాడు.కొత్త కాన్సెప్ట్, కొత్త వర్క్ కానీ వేణు ఆ పనిలో సూపర్ సక్సెస్ అయ్యారు.ఈరోజు బుల్లితెర మెగాస్టార్ అని అందరి చేత కీర్తించబడుతున్న సుధీర్ ని బుల్లితెరపైకి తీసుకొచ్చింది కూడా వేణునే.

ఒక్క సుదీర్ కి మాత్రమే కాదు.గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ వంటి వారు కూడా వేణు ద్వారా జబర్దస్త్ లోకి వచ్చినవారే.

నిజానికి వేణుకి తన గురువు తేజ అంటే చాలా ఇష్టం.ఆయనే వేణుకి మొదటి అవకాశం ఇచ్చింది.

కానీ., ఈ మధ్య కాలంలో వేణుకి అంతగా సినిమా అవకాశాలు రావడం లేదు.

కానీ., వేణు ప్రస్థానానికి అయితే డోకా లేదు.

మరి.చూశారు కదా? కమెడియన్ వేణు ఎలా కష్టపడి పైకి వచ్చాడో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube