సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో తెలియని చీకటి కోణాలు ఉంటాయి.బాధలు ఉంటాయి.
కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమా రంగంలోకి వచ్చాక ఎన్నో జాగ్రతల్లు పడాల్సి ఉంటుంది.
లేదంటే అడుగడుగున మోసపోక తప్పని పరిస్థితి ఉంటుంది.అంతేకాదు.
మోసాలను, ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లే సినిమా రంగలోకి అడుగు పెడితే బాగుంటుంది.ఈ తరం అమ్మాయిలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలియాలంటే ఒకప్పుడు గ్లామర్ డాల్ గా వెలిగిన సిల్క్ స్మిత జీవితం గురించి తెలుసుకోక తప్పదు.
అత్యంత తక్కువ కాలంలోనే సిల్క్ స్మిత అగ్రతారగా ఎదిగిపోయింది.తన అందచందాలతో జనాలను విపరీతంగా ఆకట్టుకుని ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది.ఎంత త్వరగా ఎదిగి వచ్చిందో.అంతే త్వరగా ఈ రంగం నుంచే కాదు.
ఈ లోకం నుంచే వెళ్లిపోయింది.నమ్మిన వాళ్లే తనను మోసం చేశారు.
ఆ బాధ మూలంగానే అత్యంత దయనీయ స్థితిలో కన్ను మూసింది.కేవలం 36 సంవత్సరాల వయుసులో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.ఇంతకీ తను ఎందుకు అలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం
ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని కొవ్వలిలో తను జన్మించింది.అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి.పెద్దగా చదువుకోలేదు.అయినా సినిమాల పట్ల ఆసక్తితో తన పెద్దమ్మ అన్నపూర్ణతో కలిసి మద్రాసు వెళ్లింది.అక్కడ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు.ఓ హీరోయిన్ కు మేకప్ వేసే పనిలో జాయిన్ అయ్యింది.
ఆమెను చూసిన ఓ తమిళ దర్శకుడు చిన్న అవకాశంఇచ్చాడు.పేరు సిల్క్ స్మితగా మార్చాడు.
ఆ పాత్రలో తను ఎంతో ఆకట్టుకుంది.మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అక్కడి నుంచి తను వెనుదిరిగి చూసుకోలేదు.తక్కువ సమయంలోనే డబ్బు, పేరు సంపాదించింది.
ఆ సమయంలో తన చుట్టూ చేరిన వాళ్లని తనవాళ్లే అనుకుంది.పెద్దమ్మ అన్నపూర్ణ చెప్పినా పట్టించుకోలేదు.
పెళ్లై పిల్లలున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అతడు తనని మోసం చేసి.
తన ఆస్తినంతా కాజేశాడు.సర్వం కోల్పోయిన సిల్క్.
పెద్దమ్మ దగ్గర ఏడ్చినా లాభం లేకపోయింది.పెద్దమ్మను ఊరెళ్లి రమ్మని చెప్పి తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది.
తన పెద్దమ్మ అన్నపూర్ణే తన అంత్యక్రియలు నిర్వహించింది.