రాఘవేంద్రరావు తొలిపండు పడింది విజయశాంతి పైనే..

ప్రముఖ దర్శకుడు కేఎస్ ప్రకాశ్ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వ్యక్తి కె రాఘవేంద్రావు.దర్శకుడిగా మారి వందకు పైగా సినిమాలు చేశాడు.నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్నాడు.సోగ్గాడు శోభన్ బాబు హీరోగా వచ్చిన బాబు సినిమాతో రాఘవేంద్రరావు దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.తొలి సినిమా నుంచే మంచి దర్శకుడిగా మారిపోయాడు.తెలుగులో వంద సినిమాలకు దర్శకత్వం వహించిన అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకడిగా నిలిచిపోయాడు.

 Untold Story Of Raghavendra Rao Fruit Task , Raghavendra Rao, Fruit Task , Tolly-TeluguStop.com

టాలీవుడ్ లో హీరోయిన్లను ఎంత అందంగా చూపించాలో.ఏ యాంగిల్స్ లో వారిని చూపిస్తే జనాలు బాగా అట్రాక్ట్ అవుతారో రాఘవేంద్రరావుకు తెలిసినట్లు మరే దర్శకుడికి తెలియదు అంటే ఆశ్చర్యం కలగక మానదు.ఆయన కెమెరా ముందు ప్రతి భామ ముద్దబంతి పువ్వుగా మారిపోవాల్సిందే.16 ఏండ్ల వయసులో కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వులా ఆవిష్కరించి తన ప్రత్యేకత చాటుకున్నాడు.హీరోయిన్ ను శృంగార బొమ్మలా చూపించడంలో తను సక్సెస్ అయ్యాడు.అంతేకాదు.తన సినిమాల్లో కథ, కథనంతో పాటు సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు.ఆయన సినిమాల్లో పాటల కోసమే జనాలు థియేటర్లకు వచ్చేవారు.

హీరోయిన్స్ నడుముపై పూలు, పండ్లు వేయించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు.

Telugu Chiranjeevi, Donga, Fruit Task, Fruits, Raghavendra Rao, Tollywood, Untol

హీరోయిన్ల బొడ్డుపై పూలు పండ్లు వేయడం అనేది చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన మంచి దొంగ సినిమా నుంచే ప్రారంభం అయ్యింది.ఈ సినిమాలో బెడ్ లైట్ తగ్గించని అనే పాటలో తొలిసారి విజయశాంతిపై పండ్లు వేశారు.ఫస్ట్ నైట్ కు సంబంధించిన పాట కావడంతో వెరైటీగా ఉంగాలని కాస్త కొత్తగా ప్లాన్ చేశారు.

ఈ పాటకు చక్రవర్తి అద్భుతమైన బాణీలు అందించాడు.వాటికి అనుగుణంగా విజయశాంతి బొడ్డుపై తొలిసారి పండ్లు వేయించాడు రాఘవేంద్రరావు.

ఆ తర్వాత పలువురు హీరోయిన్లపై ఆయన ఈ ప్రయోగం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube