తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది నటులు తమ నటన ప్రతిభతో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు.అలాంటి వారిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటివారు అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలో చాలా మంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన నటనతో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు పొందారు అలాంటి వాళ్ళలో రాధిక, రాధ, విజయశాంతి లాంటి వారు ఉన్నారు.
కానీ ఇండస్ట్రీలోకి సితార సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భానుప్రియ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని తన కంటే ముందు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లకు గట్టిపోటీని ఇచ్చారు. చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో నటించి డ్యాన్సుల్లో చిరంజీవితో సహా పోటీపడి డ్యాన్సులు చేశారు.
సినిమాల్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భానుప్రియ వెంకటేష్ తో కె విశ్వనాథ్ గారు తీసిన స్వర్ణకమలం సినిమాలో హీరోయిన్ గా నటించి ఆ సినిమాలో తను చేసిన క్లాసికల్ డాన్స్ కి మంచి గుర్తింపు లభించింది.ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా మొత్తం భానుప్రియ గారి పాత్ర మీద ఆధారపడి ఉంటుంది అలాంటి పాత్రలో అలవోకగా నటించి మంచి మార్కులు కొట్టేశారు.
ఆమె సినిమా జీవితం ఇలా ఉంటే తన పర్సనల్ లైఫ్ ఒకలా ఉంది అప్పట్లో ఆవిడని సితార సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వంశీ గారిని ప్రేమించారు, వంశీ కూడా తనని ప్రేమించాడు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ భానుప్రియ వాళ్ళమ్మ దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అప్పటికే వంశీకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆ కారణం చేత భానుప్రియ వాళ్ళ అమ్మ వీళ్ల పెళ్లికి అంగీకరించలేదు దాంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది.భానుప్రియ నుంచి విడిపోయిన తర్వాత వంశీ కూడా కొన్ని రోజులు సినిమాలు చేయలేదు అలాగే ఆయన మతిస్థిమితం కూడా సరిగా లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి దాంతో ఆయన యానాం వెళ్లి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ రెస్ట్ తీసుకున్నాడు.ఈయన పరిస్థితి ఇలా ఉంటే భానుప్రియ గారు కూడా బాగా డిస్టర్బ్ అయ్యారు.
మొత్తానికి 1998లో ఎన్నారై అయిన కౌశల్ గారిని పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులు అమెరికాలోనే జీవితాన్ని గడిపారు వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది.కానీ 2005లో భానుప్రియ గారు తన భర్తతో విడిపోయి ఇండియాకి వచ్చి ఇక్కడే ఉన్నారు, దీంతో మళ్లీ సినిమాల్లో నటించారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి గుర్తింపును సాధించారు.అయితే ఈ మధ్య ఆమె భర్త కూడా చనిపోయారు దాంతో ఆవిడ మానసికంగా కొంచెం కృంగి పోయారని మతిస్థిమితం కూడా సరిగా ఉండటం లేదని చాలామంది చెబుతున్నారు.మొత్తానికి తన మానసిక స్థితిని బాగు చేసుకుని కుదుట పడుతున్న సమయంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు అన్ని ప్రాబ్లమ్స్ ని ఒకేసారి ఫేస్ చేయడం భానుప్రియ గారి వల్ల కాలేదనే చెప్పాలి మొత్తానికి ఆవిడ తన మానసిక స్థితిని కుదుట పరుచుకుని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నట్లు మన అందరికీ తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఒక మైనర్ బాలికను ఇంట్లో పనికి పెట్టుకుని టార్చర్ పెడుతున్నట్టు భానుప్రియ గారి మీద ఆమధ్య పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది.
ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొంది ఆ తర్వాత తల్లి పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించిన భానుప్రియ గారు ప్రస్తుతం చాలా ఇబ్బందులకు గురి కావడం అనేది అందరినీ చాలా బాధకు గురి చేసే విషయం.ఏదేమైనప్పటికీ అటు వంశీ గారు, భానుప్రియ గారు ఇద్దరు కొన్ని రోజులపాటు మతిస్థిమితం లేకుండా గడపడం అనేది చాలా బాధకు గురి చేసే విషయం అని చెప్పాలి మొత్తానికి ఇప్పుడు ఇద్దరు బాగున్నారు.
కనుక ఇక మీదట నుంచి వాళ్లకి అంతా మంచి జరగాలని కోరుకుందాం…
.