పెళ్ళైన వాడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కుష్బూ..ఇందులో నిజమెంత.. ?

Untold Love Story Of Heroine Khushboo And Prabhu, Heroine Khusboo, Hero Prabhu, Love Story, Khusboo Screen Name, Kaliyuga Pandavulu, Khusboo Father, Mother Characters, Tollywood Entry, Ramanaidu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి గుర్తింపు సాధించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఒకానొక సందర్భంలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా మంచి పేరు సాధించుకున్నారు.

 Untold Love Story Of Heroine Khushboo And Prabhu, Heroine Khusboo, Hero Prabhu,-TeluguStop.com

ఇలాంటి వారిలో చాలా మంది అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వారు ఉన్నారు.కొంతమంది మధ్యలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారు ఉన్నారు.

ఇక్కడ ఉన్న హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయమే.అందులో అప్పట్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన చాలా మంది హీరోయిన్లు చాలా కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగారు.

అయితే వెంకటేష్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న అప్పుడు అతని పక్కన హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అనుకున్న సందర్భంలో కుష్బూని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.

అయితే కుష్బూ తను హీరోయిన్ కావడానికి చాలా కష్టపడినట్టు గా తెలుస్తుంది.

ముఖ్యంగా వాళ్ళ నాన్న తో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది అంట.రోజూ తాగి వచ్చి వాళ్ళ అమ్మ ని, వాళ్ళ అన్నయ్యని, కుష్బూని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు.అయితే మొదట ముంబైలో ఉండి కొన్ని సినిమాలో బాలనటిగా కూడా నటించింది అలా తనకు బాలనటిగా కూడా మంచి పేరు రావడంతో బాలనటిగా వరుసగా చాలా సినిమాలో అవకాశం రావడం మొదలయ్యాయి కుష్బూ అసలు పేరు న‌ఖ‌త్ ఖాన్‌ స్క్రీన్ నేమ్ గా కుష్బూగా మార్చుకుంది అయితే సినిమాల్లో చేసినప్పటికీ వాళ్ళ నాన్న ఇంట్లో వీళ్ళందర్నీ టార్చర్ పెడుతూ వచ్చిన డబ్బులు మొత్తం తనే తాగడానికి తీసుకునేవాడు అని తను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.అందుకే వాళ్ళ నాన్న అంటే తనకు అసహ్యం అని అసలు ఎప్పుడు ఆయన్ని కలవడానికి ఇష్టపడను అని చెప్పారు.

ఇప్పటికే ఆయన్ని కలిసి 30 సంవత్సరాలు అవుతుంది అని చెప్పింది.

Telugu Prabhu, Khushboo, Khusboo, Khusboo Screen, Love Story, Ramanaidu, Tollywo

కెరియర్ మొదట్లో కుష్బూని బోని కపూర్ హిందీ లో ఒక సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేద్దాం అనుకున్నప్పటికీ అది కుదరలేదు దాంతో కలియుగ పాండవులు సినిమా ద్వారా వెంకటేష్ తో కలిసి రామానాయుడు కుష్బూని తెలుగు తెరకు పరిచయం చేశాడు.తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తను హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించింది అలాగే తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది.తమిళ సినిమా ప్రేమికులు అయితే ఖుష్బూకి ఏకంగా గుడి కట్టించారు అనే చెప్పాలి అలా తన ప్రస్తావన అనేది చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిందని చెప్పాలి.

ప్రస్తుతం ఇప్పుడు కూడా అమ్మ క్యారెక్టర్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు అయితే ఒక సందర్భంలో వాళ్ళ నాన్న ముంబై నుంచి వాళ్ళని చెన్నై తీసుకువచ్చి చెన్నై లోని ఒక ఇంటి లో రెంటుకు ఉంచి కుష్బూ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తను తాగడానికి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.అప్పటినుంచి ఖుష్బూనే సినిమాలు చేస్తూ కుటుంబ భారాన్ని మోసుకుంటూ వచ్చింది.

Telugu Prabhu, Khushboo, Khusboo, Khusboo Screen, Love Story, Ramanaidu, Tollywo

కుష్బూ వాళ్ళ నాన్న ఆవిడ చేసిన సినిమాల రెమ్యూనరేషన్ ని తీసుకోవడానికి ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్లేవాడు.అతని అబ్జర్వ్ చేసిన రామానాయుడు కొన్ని సందర్భాల్లో డబ్బుల కోసం తన దగ్గరికి వచ్చిన ఖుష్బు వాళ్ళ నాన్నతో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసాను అని అబద్ధం చెప్పి ఆ డబ్బులు కుష్బూ బ్యాంక్ అకౌంట్లో వేసేవాడు.అయితే తన మొదటి సినిమా అయినా కలియుగ పాండవులు సినిమా కి రామానాయుడు ప్రొడ్యూసర్ అయితే రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో కుష్బూ చాలా బాగా నటించారు అందుకే ఇప్పటికీ రామానాయుడు, రాఘవేంద్ర రావు గారిని కుష్బూ తన సొంత మనుషుల భావిస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పారు.

Telugu Prabhu, Khushboo, Khusboo, Khusboo Screen, Love Story, Ramanaidu, Tollywo

 సినిమాల్లో నటిస్తున్న క్రమంలో హీరో ప్రభు తో కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉంది.కానీ ప్రభు వాళ్ళ కుటుంబం వీరి ప్రేమకు అంగీకారం చెప్పకపోవడంతో ఈ ప్రేమ పెటాకులు అయ్యింది. తర్వాత రోజుల్లో డైరెక్టర్ సి సుందర్ గారిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.వీళ్ళకి ఇద్దరు పిల్లలు అవంతిక ఆనందిత ప్రస్తుతం ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి తల్లి పాత్రను పోషిస్తున్నారు.

ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కి అమ్మ గా నటించి మంచి గుర్తింపు సాధించింది.ఇంకా చాలా సినిమాల్లో నటిస్తూ నటిగా ప్రస్తుతం బిజీగా గడుపుతోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube