చరిత్ర మరచిన.. మరో అల్లూరి వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే?

స్వాతంత్ర సమరయోధులు అనగానే అందరికీ గుర్తొచ్చేది మహాత్మాగాంధీ , సుభాష్ చంద్రబోస్, నెహ్రూ అయితే వీళ్లకు ముందే స్వతంత్ర కాంక్ష బ్రిటిషర్ల అణచివేతను అణగదొక్కాలని అనుకున్నా స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి.వాళ్ళ కథలు మనకు తెలియకపోయినా వాళ్లు చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు స్వతంత్ర భారతంలో బ్రతుకుతున్నాం.

 Untold Hystory About Unsung Great Freedom Fighter Vasudev Balwant Phadke Details-TeluguStop.com

మనం చెప్పుకునే గాంధీ నెహ్రూ లాంటి ఊరు వారు కూడా వీరు రగిల్చిన స్వతంత్ర కాంక్షకు కొనసాగింపు మాత్రమే అని చెప్పాలి.ఇక అలాంటి ఒక వీరుడు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయన పేరు వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే. ఈయన ఎవరు అనుకోవచ్చు.ఎందుకంటే కనుమరుగైన చరిత్రలో ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు ఈయన.1845లో మహారాష్ట్రలోని రాయగడ జిల్లా షిర్దోవ్ ప్రాంతంలో జన్మించాడు.చిన్నప్పటినుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు.ఇక అతని చదువు పూర్తిచేసిన తర్వాత తండ్రి అతన్ని ఒక వడ్డీ వ్యాపారి దగ్గర పది రూపాయల జీతానికి పెట్టాడు.ఉద్యోగం చేసే ప్రసక్తే లేదు అంటూ అక్కడి నుంచి వచ్చేశాడు.ఆ సమయంలోనే పుణేలోని మిలిటరీ అకౌంట్స్ విభాగంలో చేరాడు.

పదిహేనేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేశాడు.ఆ సమయంలోనే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను కలిశాడు.ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిషర్ల పై పోరాటం చేయాలనే ఒక ఆలోచన ఆయన మనసులో పుట్టింది.

1871లో ఓ రోజు ఆయనకు ఒక ఉత్తరం అందింది.త్వరగా వచ్చేయ్ లేదంటే మీ అమ్మని చూడలేవు అని.

Telugu Balwantphade, Balwantphadke, Britishers, Freedom Fighter, Independence, I

దీంతో వెంటనే వెళ్లి బ్రిటిష్ అధికారిని సెలవు కావాలంటూ కోరాడు.భారతీయులని కనీసం మనుషుల్లా కూడా చూడనీ రోజులవి.సెలవు ఇవ్వను పొమ్మన్నాడు బ్రిటిష్ అధికారి.

దీంతో కోపం వచ్చినా వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే ఇక ఉద్యోగానికి స్వస్తి పలికి ఇంటికి వచ్చేసాడు.కానీ అప్పటికే ఆలస్యమైంది.

అమ్మ చనిపోయింది.దీంతో అతని గుండె రగిలిపోయింది.

ఇక తన మనసులో బ్రిటిషర్ల పై పోరాటం చేయాలనే ఆలోచనకు అప్పుడు ఆచరణలో పెట్టాడు.ఎంతో కష్టపడి ఒక సైన్యాన్ని సంపాదించుకున్నాడు.

అయితే ఆయుధాలు డబ్బు కోసం ఎంతో మంది వడ్డీ వ్యాపారులను దోచుకుంటూ ఉండేవాడు.

దీంతో వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే అందరికీ టార్గెట్ గా మారిపోయాడు.

అందరూ కలిసి మీటింగ్ నిర్వహించి ఆయనను హతమార్చాలి అనుకున్నారు.

Telugu Balwantphade, Balwantphadke, Britishers, Freedom Fighter, Independence, I

కానీ అంతకుముందే అక్కడికి చేరుకున్న వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే అందరిని చంపి భవనాన్ని కాల్చేశాడు.ఈ క్రమంలోనే ఒక బ్రిటీష్ అధికారి రిచర్డ్స్ వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే తల తెచ్చిస్తే 50000 బహుమతి అంటూ ప్రకటించాడు.వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే ఊరుకోకుండా రిచర్డ్స్ తల తెచ్చిస్తే 75000 బహుమతి అంటూ పోస్టర్లు అంటించాడు.

తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది.ఒకానొక సమయంలో ఒక గుడిలో నిద్రపోతున్న సమయంలో అందుకున్న బ్రిటిషర్లు జైలు కి తీసుకెళ్లారు.

ఇక అక్కడ ఓ లాయర్ కారణంగా ఉరిశిక్ష కాస్త కారాగార శిక్ష గా మారిపోయింది.అండమాన్ పంపించారు.1987 ఫిబ్రవరి లో చివరికి తుది శ్వాస విడిచారు వాసుదేవ్ బల్వాన్త్ పడ్కే.అయన మరణించినా ఆయన పుట్టించిన స్వతంత్ర కాంక్ష మాత్రం రగులుతూనే వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube