ఆ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ ను దాటేసిన చిరంజీవి.. అసలేమైందంటే?

1981 అక్టోబర్‌లో విడుదలైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.ఆ సందడిని చూసి సినీ విశ్లేషకులే ఆశ్చర్యపోయారు.

 Untold Facts About Ntr And Chiranjeevi, Ntr, Chiranjeevi, Tollywood, Sri Devi-TeluguStop.com

అందులో ఒక చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తే, మరొక చిత్రంలో చిరంజీవి నటించారు.ఎన్టీఆర్ నటించిన చిత్రం కొండవీటి సింహం.

చిరంజీవి చేసిన మూవీ చట్టానికి క‌ళ్లు లేవు.

ఇకపోతే శ్రీదేవీ కథానాయికగా, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కొండవీటి సింహంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు.

ఇందులో ఎన్టీఆర్ పోషించిన ఎస్పీ రంజిత్ పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వేటూరి రాసిన ఏడు పాటలకు సంగీత దర్శకుడు చక్రవర్తి అద్భుతమైన బాణీలు సమకూర్చారు.

పాటలన్నీ హిట్టే.విజయదశమి సందర్భంగా 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

ఇదిలా ఉండగా చట్టానికి క‌ళ్లు లేవు చిత్రానికొస్తే ఇది తమిళంలో వచ్చిన సినిమాను ఆధారంగా తీసుకొని చేసిన మూవీ. నేటి తమిళ చిత్ర రంగ పరిశ్రమలోని సూపర్ స్టార్ విజయ్ తండ్రి ఎస్‌.

ఏ.చంద్రశేఖర్ తమిళంతో పాటు, తెలుగు సినిమాకూ దర్శకత్వం వహించారు.చిరంజీవిని పూర్తి స్థాయి హీరోగా నిలిపిన చిత్రం ఇదేనని చెప్పవచ్చు.ఆయన నటజీవితాన్ని మలుపు తిప్పిన ఖైదీ అప్పటికీ విడుదల కాలేదు.కానీ ఈ సినిమాతోనే ఆయన స్టార్ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Telugu Chiranjeevi, Sri Devi, Tollywood-Movie

ఇకపోతే ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి.కొండవీటి సింహం 100 రోజులు విజయవంతంగా ఆడితే, దాన్ని తలదన్నేలా 107 రోజులు చట్టానికి క‌ళ్లు లేవు సినిమా రికార్డును బ్రేక్ చేసింది.సంధ్య థియేటర్‌లో 100రోజులు ప్రదర్శితమైన తొలి సినిమా కూడా ఇదే.ఇలా చట్టానికి కళ్లులేవు సినిమాతో చిరంజీవి ఎన్టీఆర్ సినిమాని క్రాస్ చేశారని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube