అంజలీ దేవి.( Anjali devi ) అనార్కలి సినిమా ద్వారా ఒక తరం ప్రేక్షకులను తన అంద చందంతో మంత్రం ముద్దుల చేసింది.
అంజలీ దేవి ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswararao ) తోనే సినిమాల్లో నటించింది.అప్పట్లో వీరిద్దరి కలిసి నటించిన ప్రేమ కథ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
ఈ జంటకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ఉండేది.చాలా మట్టుకు సినిమాల్లో కలిసి నటించిన జంటలు ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కడం కూడా ఆ కాలం నుంచి మొదలైంది.
ఆ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు అంజలి ప్రేమించి పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని కొంతమంది గాసిప్ రాయుళ్లు కథలు కూడా అల్లారు.

అయితే అది నిజమో అబద్దమో తెలియదు కానీ అక్కినేని నాగేశ్వరరావు తన మేనమామ కూతురు అన్నపూర్ణమ్మతో సెటిలైపోతే, అంజలి దేవి మాత్రం అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సంగీత దర్శకుడు ఆది నారాయణను( Adi narayana ) పెళ్లి చేసుకుంది.అయితే ఈ విషయాలపై గుమ్మడి తన పుస్తకంలో కొన్ని వివరాలను వెల్లడించారు.అంజలీదేవి ప్రేమ వివాహం కాదు కానీ ఆది నారాయణ అంజలి కుటుంబానికి దూరపు బంధువు ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు.
అంజలికి సంబంధించిన క్షేమ సమాచారాలు ఆదినారాయణ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకునేవారు.తద్వారా వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది దాంతో కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు.

అలా అంజలీ దేవి సినిమా ఇండస్ట్రీలోనే సెటిలైంది.అయితే వీరి పెళ్లి బంధం పై అంజలి ఒక ఇంటర్వ్యూలో కూడా స్వయంగా కొన్ని విషయాలను వెల్లడించారు.మాది ప్రేమ వివాహం కాదు, పెద్దలకు కుదిరిచిన వివాహమే.మా ఇంటికి నారాయణ రావు గారు తరుచుగా వచ్చేవారు.అతడు కూడా సినిమాల్లో ఉండడంతో నా జీవితం బాగుంటుందని నా తల్లిదండ్రులు అనుకున్నారు.అందుకే మాకు వివాహం చేశారు వారి దయవల్ల మేము సంతోషంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు అంజలీ దేవి.
అయితే అంజలీదేవి నిజంగానే అక్కినోనితో ప్రేమలో పడ్డారని కొంతమంది అంటూ ఉంటారు.
