సూర్యకాంతమ్మ ఆస్తిని తన సొంత లాయర్ మోసం చేసి ఎలా కాజేసాడు..?

ఆమె పేరు వింటే కట్టుకున్న భర్త దగ్గర నుండి ఇంట్లో కొడుకు, కోడలు ఇరుగుపొరుగు వారితో సహా అందరూ హడలిపోవాల్సిందే.గడసరి అత్తగా, గయ్యాల అత్తగా ఆమె పెట్టె వేధింపులకు కోడళ్లు అదిరిపడాల్సిందే.

 Untold Facts About Actress Suryakantham, Actress Suryakantham, Tollywood, Chalapathi Rao, Mayabajar, Dongaramudu-TeluguStop.com

అలా అత్తంటే రాక్షసి అనే ముద్ర పడేలా వెండితెరపై ఆమె ప్రదర్శించిన గయ్యాళితనాన్ని అసహ్యించుకోని తెలుగువారు లేరు.కానీ వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం.

సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్లు.ఆ నటి మరెవరో కాదు సూర్యకాంతం.సూర్యకాంతమ్మ గారు సినిమాల్లో ఎంత పెద్ద నటి అయినా ఆమె చివరి రోజుల్లో మాత్రం చాల కష్టాలు అనుభవించింది అవేంటో ఇప్పుడొకసారి చూద్దాం.

 Untold Facts About Actress Suryakantham, Actress Suryakantham, Tollywood, Chalapathi Rao, Mayabajar, Dongaramudu-సూర్యకాంతమ్మ ఆస్తిని తన సొంత లాయర్ మోసం చేసి ఎలా కాజేసాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1924, అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పాలెం అనే గ్రామంలో సూర్యకాంతం గారు జన్మించారు.అయితే హీరోయిన్ కావాల్సిన సూర్యకాంతం గారు ఒక కారు ప్రమాదంలో మొహం మీద పడ్డ గాయాల వలన ఆమెకి వచ్చిన హీరోయిన్ అవకాశాలు చేజారిపోయాయి.దాంతో సహాయ పాత్రలు… ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితం కావలసివచ్చింది.1953లో వచ్చిన ‘కోడరికం’ చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్‌ మార్క్‌గా సూర్యకాంతం నిలిచారు.తన హావభావాలతో వెటకారం రంగరించిన గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు.

ఆ తరువాత ‘చిరంజీవులు’, ‘మాయాబజార్‌’, ‘దొంగరాముడు’, ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘అత్తా ఒకింటి కోడలే’, ‘ఇల్లరికం’, ‘భార్యాభర్తలు’ గుండమ్మ కథ వంటి అనేక సినిమాలలో సూర్యకాంతం వైవిధ్యభరితమైన సహజ నటనను ప్రదర్శించారు.అప్పట్లో ‘సూర్యకాంతం’ అనే పేరును పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు జడిసే వారంటే ఆమె నటన తెలుగు ప్రజలను ఎలా కదిలించిందో మనం అర్ధం చేసుకోవచ్చు.

Telugu Chalapathi Rao, Dongaramudu, Mayabajar, Suryakantham, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అయితే సూర్యకాంతం గారు సినిమాల్లో గయ్యాళితనమంతా చూపిస్తుంది గాని బయట మాత్రం ఆమె చాల సున్నితమైన మనస్కురాలట.ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను నానామాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది.షాట్‌ అయిపోయిన తరువాత ఆమె నాగయ్య కాళ్ళమీద పడి క్షమాపణలు అడిగారట ఇది ఎంత మంచి విషయంలో కదా.అంతేకాదు ఈమె షూటింగ్ లో ఉన్నవారందరికి భోజనాలు కూడా వండుకొని వచ్చేవారట.అయితే కాంతమ్మగారు సినిమా రెమ్యునిరేషన్ విషయంలో మాత్రం చాల నిక్కచ్చిగా ఉండేవారట.తన మొదటి సినిమాకే నా కష్టానికి సరిపడా డబ్బులు ఇవ్వట్లేదని అడిగిమరీ రెమ్యునిరేషన్ ఎక్కువ తీసుకుందంటే డబ్బు విషయంలో సూర్యకాంతం గారు ఎంత జాగ్రత్తగా ఉండేవారో మనం అర్ధం చేసుకోవచ్చు.

అంతేకాదు ఈమె అప్పట్లోనే తన అన్ని ఆర్ధిక వ్యవహారాలను, కొన్ని బిజినెస్ లను కూడా తానే దగ్గరుండి చూసుకోనేవారట.

అయితే 1950 వ సంవత్సరంలో హైకోర్టు జడ్జీ అయిన పెద్దిభోట్ల చలపతి రావు గారిని వివాహం చేసుకున్నారు.

కానీ వీరికి పిల్లలు లేరు.దాంతో సూర్యకాంతం గారి చివరి రోజుల్లో తన యావత్ ఆస్తి అంతా కూడా తన సోదరులు పేరున రాయమని తన లాయర్ ని కోరిందట.

అయితే ఆ లాయర్ సూర్యకాంతం గారిని మోసం చేసి ఆ ఆస్థి మొత్తాన్ని తన పేరుమీద రాసుకున్నాడట.ఈ విషయం సూర్యకాంతం గారు చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది.

ఆ విషయం తెలుసుకున్న సూర్యకాంతం సోదరుడు గురున్డపోటుతో మరణించారట.ఆ లాయర్ చేసింది ఎంత పెద్ద మోసమే.

అందరికి తెలిసిన చట్ట ప్రకారం ఎవరు ఏమి చేయలేక పోయేసరికి ఆమె సూర్యకాంతం గారి కష్టార్జితం మొత్తం వేరేవాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయింది.ఇలా వెండితెరపై ఒక వెలుగు వెలిగి చివరి రోజుల్లో కష్టాలు అనుభవించిన అలనాటి నటుల్లో సూర్యకాంతం ఒక్కరే కాదు సావిత్రమ్మ లాంటి వారు చాలామందే ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube