సాయికుమార్ తల్లి పెళ్లికి ముందు ఎలాంటి జీవితం గడిపిందో తెలుసా?

సాయి కుమార్.తెలుగు జనాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే ఆశ్చర్యం కలగకమానదు.

 Untold Details About Sai Kumar Mother-TeluguStop.com

నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన వ్యక్తి ఆయన.ఆయన గంభీరమైన వాయిస్ తో ఎలాంటి పాత్రలకైనా డబ్బింగ్ చెప్పి వారెవ్వా అనిపించాడు.తన తండ్రి పీజే శర్మ నుంచి తన కంఠం వారసత్వం సంపదగా సాయి కుమార్ కు వచ్చింది.ఆయన కూడా మంచి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.సాయికుమార్ కు చిన్నప్పటి నుంచి తన తల్లి అంటే ఎంతో ప్రేమ.ఆమెకు మన సంప్రదాయాలు అన్నా, పురాణాలు అన్నా.

ఎంతో గౌరవం.

 Untold Details About Sai Kumar Mother-సాయికుమార్ తల్లి పెళ్లికి ముందు ఎలాంటి జీవితం గడిపిందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాయి కుమార్ సహా మిగతా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పీజే శర్మ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.

కనీసం పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉండేవాడు.సాయి కుమార్, ఆయన పెద్ద చెల్లెలు స్కాలర్ షిప్ తోనే చదువుకున్నాడు.ఆయన ఎప్పుడూ టెక్ట్స్ పుస్తకాలు కొనేవాడు కాదు.తన సీనియర్స్ దగ్గర తెచ్చుకుని చదువుకునేవాడు.

మధ్యాహ్నం పూట వారికి వాళ్లమ్మ గోధుమన్నం బాక్సులో పెట్టి ఇచ్చేది.అది తిన లేక సాయికుమార్ చెల్లి ఏడ్చేది.తినడానికి సరిగా ఫుడ్ కూడా ఉండేది కాదు.అయినా తన తల్లి వీరిని మంచి వారిగా తీర్చిదిద్దింది.

Telugu Hero, Jv Somayalujulu, Pj Sharma, Ramana Murthy, Sai Kumar, Sai Kumar Mother, Tollywood, Untold Details About Sai Kumar Mother-Telugu Stop Exclusive Top Stories

సాయి కుమార్ తండ్రి పీజే శర్మ రైల్వే ఉద్యోగి.విజయనగరంలో ఉద్యోగం చేసేవాడు.అక్కడే జేవీ సోమయాలుజులు, రమణ మూర్తితో కలిసి నాటకాలు వేసేవాడు.నటన మీద ఆసక్తితో మద్రాసు వెళ్లి చిన్న చిన్న వేషాలు వేసేవాడు.అనంతరం 1959లో ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసులు స్థిరపడ్డాడు.సాయికుమార్ వాళ్లమ్మ ఒకప్పుడు మహారాణిలా బతికారు.

వాళ్లది కర్నాటకలోని బాగేపల్లి.ఆమె ముత్తాతలు మైసూరు రాజుల దగ్గర పనిచేసేవారు.

పెళ్లికి ముందు ఆమె పోలో ఆడేవారు.శర్మ కోసం అన్ని వదులుకుని వచ్చారు.

వారిద్దరినీ రంగస్థలం కలిపింది.ఓసారి అనార్కలీ వేషం వేసిన ఆమెను చూసి శర్మ చాలా ఇష్టపడ్డారు.

అదే నాటకాల పోటీలో శర్మ శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుగా చేశారు.అలా ఇద్దరు పరిచయం అయ్యారు.

అనంతరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.వీరికి మొత్తం ఐదుగురు సంతానం.

వారిలో సాయికుమార్ పెద్దవాడు.

#JV Somayalujulu #Ramana Murthy #PJ Sharma #Sai Kumar #UntoldDetails

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు