17 ఏళ్లుగా శింబు ధనుష్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుసా.. ?

సినిమా ఇండస్ట్రీ లో హీరోలు వాళ్ళకంటూ స్వతహాగా కొన్ని మంచి సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు నచ్చిన సినిమాలు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు.అయితే ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఇద్దరు హీరోల మధ్య ఎప్పుడైనా పోటీ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది.

 Untold Conflicts Between Simbu And Dhanush-TeluguStop.com

ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీని చూసుకుంటే మొదట్లో ఎంజీఆర్, శివాజీ గణేశన్ హీరోల మధ్య పోటీ అనేది ఉండేది.అలాగే ఆ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు పైకి ఎదుగుతూ వచ్చారు.

వారిద్దరి మధ్య కూడా కొన్ని రోజులపాటు పోటీ అనేది నడుస్తూ నిజానికి చెప్పాలంటే హీరోల మధ్య పోటీ ఉండదు వాళ్లకు వాళ్ళు బాగానే ఉంటారు.కానీ వాళ్ళ ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళు వ్యక్తుల మధ్య మాత్రమే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే పోటీ నడుస్తూ ఉంటుంది.

 Untold Conflicts Between Simbu And Dhanush-17 ఏళ్లుగా శింబు ధనుష్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుసా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు నడుస్తూనే ఉంటాయి అయితే రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరో గా  గుర్తింపు పొందారు కమల్ హాసన్.రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ వచ్చాడు.

కానీ రజనీకాంత్ మాత్రం కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మాస్ హీరోగా సూపర్ స్టార్ గా ఎదిగాడు.వీళ్ళిద్దరూ ఇలా ఉంటే వీళ్ళ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ అజిత్ మధ్య కూడా వాళ్ళ ఫ్యాన్స్ గొడవలు పెట్టుకున్నారు అని చెప్పాలి అయితే అజిత్ ఫ్యాన్స్ తో మాట్లాడుతూ నా సినిమా రిలీజ్ అయినప్పుడు అది చూడండి.

నచ్చితే మళ్లీ మళ్లీ చూడండి దాన్ని సక్సెస్ చేయండి అంతేగాని మీ పని వదులుకొని మరి నా గురించి వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు మీరు బాగుంటేనే మేము బాగుంటాం మీ పని మీరు చేసుకోండి అని చెప్పిన వినకుండా అప్పటి నుంచిఅజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిందే తప్ప తగ్గలేదు.

అలా విజయ్ ఫ్యాన్స్ కూడా విజయ్ గురించి గొప్పగా చెబుతూ ఉండేవారు వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు అనేది కామన్ గా జరుగుతూ వస్తూ ఉంటాయి.రీసెంట్ గా కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన శింబు ధనుష్ ల మధ్య కూడా పోటీ అనేది జరుగుతూ ఉండేది.శింబు చిన్నప్పటి నుంచే ఆర్టిస్టగా మంచి గుర్తింపును పొందుతూ వచ్చాడు.

వాళ్ళ నాన్న టీ రాజేందర్ దర్శకుడు అనే విషయం అందరికి తెలిసిందే అయితే ధనుష్ కూడా దర్శకుడు కస్తూరి రాజా కొడుకు అనే విషయం మనకు తెలిసిందే.కస్తూరి రాజా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు అయితే మొదటి నుంచి ధనుష్ కి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడంతో సెల్వరాఘవన్ చెబితే ఆయన మాట విని వాళ్ళ నాన్న దర్శకత్వంలో మొదటి సినిమా చేశాడు.

మొదటి సినిమా ప్లాప్ అయింది రెండో సినిమాగా సెల్వరాఘవన్దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ధనుష్ సక్సెస్ఫుల్ గా కెరియర్ సాగుతుంటే శింబు మాత్రం పోటీ నుంచి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవాడు.అతనివి మొదట వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ మన్మధ అనే సినిమాతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ధనుష్ ఎప్పుడూ వచ్చేవాడు కాదు అందులో భాగంగానే అతని మీద చాలా సెటైర్లు వేస్తూ వస్తూండేవాడు వీళ్ల మధ్య పోటీ జరుగుతుంటే ధనుష్ రజినీకాంత్ కూతురు అయిన ఐశ్వర్య ని పెళ్లి చేసుకున్నాడు.శింబు ఆ విషయాన్ని జీర్ణించుకోలేక వీరిద్దరి మధ్య ఎప్పటికప్పుడు పోటీ నడుస్తూనే ఉంది.

శింబు హీరోయిన్ల తో ఎఫైర్ లు పెట్టుకోవడం షూటింగ్ స్పాట్ కి సరిగ్గా సమయానికి రాకపోవడంతో అతని మీద చాలా మంది దర్శక నిర్మాతలకు నెగిటివ్ అభిప్రాయం కలిగింది దాని వల్ల తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాడు.ప్రస్తుతం శింబు కి సరిగా సక్సెస్ లేదనే చెప్పాలి.

Telugu Dhanush, Dhanush India Wise Papularity, Ishwarya, Kama Hsan, Kollywood, Manmadha Movie, Rajanikanth, Shimbu, Simbu, Simbu And Dhanush, Tollywood, Untold Conflicts, Vishal-Movie

ధనుష్ మాత్రం ఇండియా వైస్ పాపులారిటీ తెచ్చుకున్న ఇండియన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శింబుకి మాత్రం ప్రస్తుతం ఇప్పుడు ఒక సక్సెస్ కూడా లేదు అయితే శింబు ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ గొడవలుపెట్టుకుంటున్నారని మనందరికీ తెలిసిన విషయమే.కానీ శింబు ధనుష్ మాత్రం చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని ఒక ఫంక్షన్ లో ధనుష్ చెప్పడం జరిగింది.అది అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు చాలా వరకు తగ్గాయి అయినప్పటికీ ఆ మధ్య వచ్చిన ధనుష్ సినిమా మీద మళ్ళీ ఏదో కామెంట్ చేశాడు.శింబు, ధనుష్ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ధనుష్ ఫ్యాన్స్ ఏమీ అనకుండా కామ్ గా ఉండిపోయారు.

ఇలా ఎప్పటికప్పుడు శింబు ఏదో ఒక విషయంలో కామెంట్ చేస్తూ వచ్చాడు.కాని ధనుష్ మాత్రం అవి పట్టించుకోకుండా నటనపై దృష్టి పెట్టి నటుడిగా తనదైన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు.

ఇదిలా ఉంటే తర్వాత విశాల్ కి ఆపోజిట్ గా మాట్లాడటం మొదలుపెట్టాడు.అతని పైన కామెంట్ చేయడం స్టార్ట్ చేశాడు విశాల్.కెరియర్ కూడా ప్రస్తుతానికి సాఫీగా సాగుతుందని చెప్పాలి.శింబు అందరి హీరోల మీద కామెంట్లు చేస్తూ తన కెరీర్ ని తనే నాశనం చేసుకుంటున్నాడు అని చాలామంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

.

#Shimbu #Ishwarya #Simbu #Dhanush #DhanushIndia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు