మొన్న‌టి దాకా తెలంగాణ‌లో.. ఇప్పుడు ఏపీలో.. పోసానికి జ‌న‌సేన కౌంట‌ర్లు

మొన్న ఆ మ‌ధ్క పోసాని కృష్ణమురళికి అలాగే జనసేనకు మ‌ధ్య ఎంత‌లా వార్ న‌డిచిందో అంద‌రికీ తెలిసిందే.అప్ప‌టి నుంచే ఆయ‌న మీద జ‌న‌సేన తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది.

 Until Recently In Telangana .. Now In Ap . Posaniki Janasena Counters, Posani Kr-TeluguStop.com

త‌మ అధినేత పవన్ క‌ల్యాణ్ ను అన్ని మాట‌లు అనేయ‌డంతో తీవ్రంగా ర‌గిలిపోయిన జ‌న‌సైనికులు ఆయ‌న్ను టార్గెట్ చేసి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా చేశారు.ఆయ‌న గ‌త చ‌రిత్ర అంటూ త‌వ్వ‌కాలు కూడా మొద‌లు పెట్టేశారు.

అయితే ఆ త‌ర్వాత పోసాని కూడా కాస్త త‌గ్గిన‌ట్టు అనిపించింది.ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ మంచోడంటూ కితాబు కూడా ఇచ్చేశాడు.

దీంతో వివాదం అక్క‌డితో ముగిసిపోయింద‌ని అనుకున స‌మ‌యానికి ఇప్పుడు ఆ వివాదం కాస్తా మ‌రో మ‌లుపు తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది.అప్ప‌టికే పోసానిని టార్గెట్ చేసి తెలంగాణ‌లో పెద్ద ఎత్తున జ‌న‌సైనికులు ఆయ‌న ఇంటిని కూడా ముట్ట‌డించారు.

ఆయ‌న ఇంటిమీద రాళ్లు కూడా విసిరారు.పోసాని మీద ఆరోప‌ణ‌లు చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా మొద‌లు పెట్టేశారు.

కాగా ఈ వివాదం హైద‌రాబాద్‌, తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం కాగా ఇప్పుడు ఏపీలో కూడా జ‌న‌సైనికులు పోసానిని టార్గెట్ చేస్తున్నారు.ఇందులో భాగంగా ఏపీలో కూడా జ‌న‌సైనికులు వ‌ర్సెస్ పోసాని అన్న‌ట్టు త‌యార‌యింద‌ని తెలుస్తోంది.

Telugu Ap, Janasainikulu, Janasena, Janasenani, Apposaniki, Posanikrishna, Tg, T

మొన్న పోసాని కృష్ణమురళీ త‌కు జ‌న‌సైనికుల నుంచి ప్రాణ‌హాని ఉందంటూ పోలీస్ స్టేష‌న్‌లో కంప్ల‌యింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.దానికి కౌంట‌ర్ వేస్తున్న‌ట్టుగా ఇప్ప‌డు ఏపీలో జ‌నసైనికులు కూడా పోసాని నుంచి త‌మ‌కు ప్రాణహాని ఉందని, కాపాడాలంటూ గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ప్రాంత జ‌న‌సైనికులు పోసాని మీద ఫిర్యాదులు కూడా చేశారు.దాంతో పాటు వైసీపీ కార్యకర్తల‌ను కూడా టార్గెట్ చేస్తూ వారిపై కూడా కంప్ల‌యంట్లు ఇచ్చేస్తున్నారు.దీంతో పోసానితో పాటు వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా దీనిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

ఏదేమైనా జ‌న‌సైనికులు ఇలా కౌంట‌ర్లు వేయ‌డం మంచిదే అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube