కల్మషం లేని ప్రేమ.. హృదయాలను గెలుచుకుంటున్న చిన్నారుల వీడియో..

పెంపుడు జంతువులు, మనుషుల మధ్య చాలా మంచి సంబంధం ఉంటుంది.ముఖ్యంగా పెంపుడు కుక్కలు మనుషులతో చాలా ప్రేమగా ఉంటాయి.

 Untainted Love Video Of Kids Winning Hearts , Pet Dog , Viral Latest , News Viral , Social Media ,kids Winning Hearts , Untainted Love-TeluguStop.com

ఇక చిన్నపిల్లలో అయితే అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా ఉంటాయి.ఇలాంటి వీడియోలు ఎన్నో చూసింటారు.

అయితే కొంత మంది డబ్బులు ఉన్న వారు తమ పెంపుడు కుక్కల దగ్గరికి పేద పిల్లలను అస్సలు రానివ్వరు.పేద, ధనిక అన్న బేధం మనుషులకు అయితే ఉంటుంది కానీ.

 Untainted Love Video Of Kids Winning Hearts , Pet Dog , Viral Latest , News Viral , Social Media ,kids Winning Hearts , Untainted Love-కల్మషం లేని ప్రేమ.. హృదయాలను గెలుచుకుంటున్న చిన్నారుల వీడియో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కుక్కలకు తెలియదు కదా.అందుకే అవి పేద పిల్లలపై కూడా ప్రేమను చూపిస్తాయి.అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఇద్దరు బెలూన్లు అమ్మే పిల్లలు ఓ కారు పక్కన నిల్చుని ఉన్నారు.

ఆ కారులో ఓ పెంపుడు కుక్క కూర్చుని ఉంది.ఆ కారు డోర్ లో నుంచి ఇద్దరు చిన్నారులు కుక్కతో ఆడుకుంటూ కనిపించారు.

పిల్లలిద్దరూ కుక్క సాంగత్యాన్ని ఆస్వాదించడం చూడవచ్చు.ఆ కుక్క కూడా ఆ చిన్నారులను చేరుకోవడానికి, వారితో ఆడుకోవడానికి తన పావును చాచడానికి ప్రయత్నిస్తుంది.

ఆ పిల్లలలో ఒకరు కుక్క బుగ్గలపై ముద్దు కూడా పెట్టాడు.ఆ కుక్కతో పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తే అర్థమవుతుంది.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.ఈ వీడియో మీ ముఖంపై చిరునవ్వులు తీసుకురావడం ఖాయం అని క్యాప్షన్ కూడా పెట్టారు.ఈ వీడియోను వేల మంది వీక్షించారు.వేల మంది లైక్ లు చేశారు.చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేశారు.ఇది గుండెను హత్తుకునేలా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ప్రేమ భాష మనిషి, జంతువు అనే తేడా లేకుండా అందరికీ అర్థమవుతుందని మరొకరు కామెంట్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube