ఎన్నడూ చూడని కొత్త అవతారంలో బాలయ్య.. గెట్ రెడీ!

నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఈ షో టాప్ లో నిలిచింది.

 Unstoppable With Nbk Season 2 Promo Details, Unstoppable With Nbk 2, Anil Ravipu-TeluguStop.com

ఆహా ఓటిటి లో స్టార్ట్ అయినా ఈ షో అందరి అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.బాలకృష్ణ అంటే ఉండే అభిప్రాయం ఈ షో వల్ల చాలా వరకు మారిపోయిందని చెప్పాలి.

అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది.ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.అయితే అతి త్వరలోనే ఈ సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది.

దీంతో అందరి ద్రుష్టి ఈ సీజన్ మీదనే ఉంది.ఇప్పటికే సీజన్ 2 నుండి అంథెం సాంగ్ తో పాటు పోస్టర్స్ కూడా రిలీజ్ చేయగా ఆకట్టు కున్నాయి.

ఇక ఇప్పుడు ఈ షో నుండి అక్టోబర్ 4న ట్రైలర్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.ఈ షో ప్రోమోకు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

మొదటి సీజన్ అప్పుడు కాన్సెప్ట్ పోస్టర్ డిజైన్ చేయగా ఇప్పుడు సెకండ్ సీజన్ లో ప్రోమో రూపొందిస్తున్నాడు.ఈ క్రమంలోనే ఈయన బాలయ్య గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

ఎవ్వరూ ఊహించని లుక్ లో ఈసారి బాలయ్యను చూడబోతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

ఈసారి సీజన్ 2 ప్రోమో సీజన్ 1 కు మించి ఉంటుంది అని.అక్టోబర్ 4న మునుపెన్నడూ చూడని అవతార్ లో బాలయ్యను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ.ట్రైలర్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాడు అని.చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ, బాలయ్య లొకేషన్ లో అన్ సీన్ పిక్ షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.

ఇక ఈ ట్రైలర్ ను విజయవాడ లో దాదాపు 20 వేల మంది అభిమానుల సమక్షంలో ప్రదర్శిస్తున్నట్టు టాక్ వస్తుంది.ఒక షో ప్రోమో ను ఈ రేంజ్ లో రిలీజ్ చేయడం ఇదే మొదటి సారి.

ఇక ప్రెసెంట్ బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.107 సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube