ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో.. సెలబ్రెటీల మాటలకూ బాలయ్యకు కోపం వస్తే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నటించిన నందమూరి బాలయ్య గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.

 Unstoppable Balayya Talkshow In Aha Ott Details, Balayya, Tollywood, Aha, Unstop-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకు పోతున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

బాలయ్య నటుడిగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయన గురించి ఈయనతో నటించిన నటీనటులే చెబుతారు.ఇక బాలయ్య కు చాలా కోపం ఎక్కువ అని ఇప్పటికే చాలా మంది పై కోపంతో అరుస్తూ ఉంటాడని అందరు అంటుంటారు.కొన్ని కొన్ని సార్లు తన కోపాన్ని మీడియా ముందు కూడా ప్రదర్శిస్తుంటాడు బాలయ్య.

ఇంత కోపంగా ఉండే బాలయ్య త్వరలోనే ఓ రియాలిటీ షో చేయనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే మంచు లక్ష్మి, సమంత, ఆలీ, రానా సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆలీ.ఆలీతో సరదాగా అనే షో ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే బాలయ్య కూడా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఆహా డిజిటల్ వేదికగా బాలయ్య ఈ చాట్ షో చేయనున్నట్లు తెలుస్తుంది.

పైగా దానికి ‘అన్ స్టాపబుల్’ అని పేరు కూడా పెడుతున్నట్లు సమాచారం.ఇక ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకొనున్నాడు.

ఇక త్వరలోనే ప్రారంభించే ఈ షోలో తొలి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబుతో ఇంటర్వ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Balayya, Mohan Babu, Tollywood, Unstoppable-Movie

ఇదంతా ఇలా ఉంటే బాలయ్యకు చాలా కోపం ఎక్కువ.కొంతమంది సెలబ్రెటీలు తిక్క తిక్క మాటలు మాట్లాడుతుంటారు.అలా మాట్లాడుతుంటే హోస్టింగ్ చేసేవాళ్ళు కాస్త ఇబ్బంది పడుతుంటారు.

నిజానికి హోస్టింగ్ చేసేవారు ఆ మాటలు విని తుడుచుకొని పోతారు.మరి బాలయ్య కు ముందే కోపం ఎక్కువ.

ఇటువంటి తిక్క తిక్క మాటలు మాట్లాడే సెలబ్రెటీలు మాట్లాడితే వారిని వేదికపై బహిరంగంగానే ఉతికేస్తారా అని అనుమానాలు వస్తున్నాయి.

మరి బాలయ్య కూడా తన మాటలతో బాగా ఆశ్చర్యపరుస్తుంటాడు.

మరి బాలయ్య తో ఇంటర్వ్యూ అంటే సెలబ్రెటీలు కూడా ఎలా రియాక్ట్ అవుతుంటారో చూడాలి.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Telugu Balayya, Mohan Babu, Tollywood, Unstoppable-Movie

ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు.ఇందులో బాలయ్య రెండు పాత్రలో కనిపించనున్నాడు.అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమాకు సైన్ చేశాడు.ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో రూపొందనుంది.వెంకీ అట్లూరి దర్శకత్వంలో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా చేయనున్నాడు.ఇక వీటితో పాటు మరి కొంతమంది దర్శకులు కూడా బాలయ్య కోసం పోటీ పడుతున్నారు.

ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతోనే బిజీగా ఉన్నారు.అలాంటిది ఈ రియాలిటీ షో ను కూడా నడిపించడానికి ముందుకు వచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube