అన్ స్టాపబుల్ 2 ..ఎన్టీఆర్ కు నో చెప్పిన బాలయ్య... ఇందులో నిజమెంత?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి సీజన్ ఎంతో విజయవంతం కాగా త్వరలోనే రెండవ సీజన్ ప్రారంభం చేయడానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

 Unstoppable 2 Balayya Said No To Ntr Is It True Details, Unstoppable 2 ,balayya,-TeluguStop.com

ఇకపోతే నేడు విజయవాడలో ఈ టాక్ షో ట్రైలర్ కార్యక్రమాన్ని విడుదల చేయనున్నారు.

ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలియగానే ఈ కార్యక్రమానికి అతిథులుగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

 Unstoppable 2 Balayya Said No To Ntr Is It True Details, Unstoppable 2 ,Balayya,-TeluguStop.com

ముఖ్యంగా నందమూరి యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ విషయం తెలిసినటువంటి నందమూరి అభిమానులు ఇలా ఒకే వేదికపై నందమూరి హీరోలను చూడబోతున్నారని తెలియగానే సంతోషం వ్యక్తం చేశారు.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో ఎన్టీఆర్ స్పందించిన తీరు పట్ల సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రావడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.ఇలా ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఇష్టపడనటువంటి బాలయ్య నిర్వాహకులకు కూడా తనని ఆహ్వానించవద్దని చెప్పారని వార్తలు వస్తున్నాయి.ఇలా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరం కావడంతో కళ్యాణ్ రామ్ పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరు కాబోతున్నారని పలువురు హీరోల పేర్లు వినబడుతున్నాయి.అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube