బేబమ్మ నటించిన యాడ్స్ ఇవే.. మాములుగా లేవుగా!

ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా ప్రస్తుతం ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో తొలిసారిగా నటించిన నటీనటులు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తమ నటనతో మంచి గుర్తింపు పొందారు.

 Unseen Advertisements Of Kritishetty , Kritishetty, Uppena, Vishnav Tej, Bebamma-TeluguStop.com

ఇక ఈ సినిమాను తొలిసారిగా దర్శకత్వం వహించిన బుచ్చిబాబు కూడా తన దర్శకత్వంతో సినిమాను మంచిగా మెప్పించాడు.ఇక ఈ సినిమాలో నటించిన కృతి శెట్టి బేబమ్మ పాత్రలో భలే ఆకట్టుకుంది.

ఇక ఈమె నటించిన యాడ్స్ గురించి తెలుసుకుందాం.

కృతి శెట్టి బుల్లితెరలో కూడా ఎన్నో ప్రకటనల్లో నటించింది.

బుల్లి తెర నుండే వెండితెరపై అడుగుపెట్టింది.ఇక ఈమె నటించిన ప్రకటనలు చూసినట్లయితే.

లైఫ్ బాయ్, డైరీ మిల్క్ చాక్లెట్, ఓ పెన్నుల కంపెనీ యాడ్ లలో ఇలా కొన్ని రకాల ప్రకటనలో నటించింది.అంతేకాకుండా స్కూల్ కి వెళ్లే సమయంలో మొట్టమొదటిసారి దుస్తుల వాణిజ్య ప్రకటనలో నటించింది.2019 లో విడుదలైన ‘సూపర్ 30‘ లో ఒక సన్నివేశంలో నటించింది.

ఇదిలా ఉంటే శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు.అంతేకాకుండా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు.అంతే కాకుండా తెలుగులో మరో ఆఫర్ ను సొంతం చేసుకుంది.

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రానుండగా.ఇందులో కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంపిక చేశారట.

ప్రస్తుతం చాలామంది దర్శకుల దృష్టి కృతి శెట్టి వైపు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube