జనసేనాని పవన్ కల్యాణ్, సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, వైసీపీ మంత్రులపై చేసిన విమర్శలకుగాను పోసాని కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా దూషించారు.అయితే, పవన్ కల్యాణ్‌ను దూషించడం వల్ల పోసాని ఇంటిపై పవన్ అభిమానులు, జనసైనికులు రాళ్ల దాడి చేశారని, తనను ఇబ్బంది పెడుతున్నారని పోసాని ఆరోపణలు చేశారు.
పవన్ కల్యాణ్ మంత్రులను ఉద్దేశించి ‘సన్నాసి’ అని మాట్లాడటం పట్ల అభ్యతరం తెలిపిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా దూషించడం సరి కాదని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.పవన్‌ను సైకో అని, అతడి ఫ్యాన్స్ సైకో ఫ్యాన్స్ అని అంటున్న పోసాని, గతంలో పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడని పేర్కొన్నారని గుర్తు చేస్తున్నారు.
రాజకీయంగా విమర్శలు చేయాల్సిందిపోయి వ్యక్తిగత స్థాయిలో పవన్ కల్యాణ్ భార్య, కుటుంబ సభ్యులను విమర్శించి ఆయన స్థాయిని తగ్గించుకున్నారని కొందరు అనుకుంటున్నట్లు సమాచారం.

సినిమా ఇండస్ట్రీ ఐక్యంగా ఉండాల్సిన వేళ ఇలా చేయడం ఏంటని చర్చించుకుంటున్నారట.ఈ క్రమంలోనే పోసానిని అఫీషియల్‌గా బహిష్కరించాలని కొందరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే, అలా బహిష్కరించడం సాధ్యకాకపోతే అనధికారికంగా అవకాశాలు రాకుండా చూడాలని పలువురు అందుకు ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
భవిష్యత్తులో పోసానికి ఎవరు అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారట.పోసాని వ్యవహారంపై సినీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి… ఇకపోతే పవన్ కల్యాణ్ మాత్రం గతం కంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉన్నారు.
పవన్ కల్యాణ్ కేంద్ర బిందువుగానే ఏపీ పాలిటిక్స్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి.గాంధీ జయంతి సందర్భంగా ఏపీలోని రోడ్ల బాగుకోసం శ్రమదానం చేసిన జనసేనాని, పలు సభల్లో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు చేశారు.
ఈ సారి గతం కంటే ఎక్కువగానే వైసీపీ నేతలపైన ఆరోపణలు చేశారు పవన్.