అనవసరంగా ఇరుక్కుపోయిన కేటీఆర్.. వదలని రేవంత్ రెడ్డి...

Unnecessarily Stuck Ktr Revant Reddy Not To Leave Revant Reddy

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురించి తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చాలా మందికే తెలుసు.కేటీఆర్ మాట్లాడేటపుడు ముందు వెనుకా ఆలోచిస్తారని, తోచిందేదో చెప్పరని అందుకే ఆయనకు ఇబ్బందులు చాలా తక్కువగా వస్తాయని అందరూ చెబుతారు.

 Unnecessarily Stuck Ktr Revant Reddy Not To Leave Revant Reddy-TeluguStop.com

కానీ కేటీఆర్ చేసిన ఓ పని ప్రస్తుతం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఆ విషయంలో వదలకుండా వెంటాడుతున్నాడు.

కేటీఆర్ నిన్న నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాంలో కూడా దీని గురించి పలువురు కేటీఆర్ ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు.వారికి ఆన్సర్ చెప్పిన కేటీఆర్ తప్పించుకునే ధోరణిని అవలంభిస్తున్నారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.ఇంతకీ ఏం జరిగిందంటే.

 Unnecessarily Stuck Ktr Revant Reddy Not To Leave Revant Reddy-అనవసరంగా ఇరుక్కుపోయిన కేటీఆర్.. వదలని రేవంత్ రెడ్డి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్రంంభగా ఆవిర్భవించిన దగ్గరి నుంచి నేటి వరకూ టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంది.దాదాపు టీఆర్ఎస్ 7 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తోంది.ఈ ఏడు సంవత్సరాలలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణను అభివృద్ధి చేశామని అధికార టీఆర్ఎస్ చెబుతుంటే అభివృద్ధి పేరు చెప్పి తెలంగాణను అప్పుల పాలు చేశారని విపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి.

ఇలా రాజకీయాలు ఎన్నో సవాళ్లు ప్రతి సవాళ్లతో నడుస్తూ వస్తున్నాయి.తాజాగా కేటీఆర్ ఒక సవాల్ విసిరారు.ఈ ఏడు సంవత్సరాల జరిగిన అభివృద్ధి పై కాంగ్రెస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.ఇదే అదనుగా భావించిన రేవంత్ రెడ్డి ఆయన సవాల్ స్వీకరించి టైమ్ డిసైడ్ చేశారు.

కానీ రేవంత్ రెడ్డి చెప్పిన టైంకు కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ అనే ట్విటర్ ప్రోగ్రామ్ చేశారు.ఇదే విషయాన్ని ట్విట్టర్ లో కూడా కొంత మంది ప్రశ్నించారు.

దానికి కేటీఆర్ రేవంత్ రెడ్డి వంటి 420తో తాను చర్చించనని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

Unnecessarily Stuck KTR Revant Reddy Not To Leave Revant Reddy, Ktr, Ask Ktr , Twitter , Ts Poltics , Social Media , Ts Congress , Bjp Party , Bandi Sanjay, Ktr - Telugu Ktr, Bandi Sanjay, Bjp, Revant Reddy, Ts Congress, Ts Poltics

#Poltics #Bandi Sanjay #Bjp #Revant Reddy #Ktr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube