థియేటర్లకు అన్‌ లాక్‌, కేంద్రం గైడ్ లైన్స్‌

కరోన కారణంగా మూతపడ్డ థియేటర్లను తెరిచేందుకు ఎట్టకేలకు కేంద్రం మార్గ దర్శకాలను విడుదల చేసింది.అక్టోబర్‌ 15 నుండి థియేటర్లను తెరుచుకోవచ్చు అంటూనే కొన్ని కండీషన్స్‌ ను పెట్టింది.

 Unlock 5.0 Green Signal For Movie Theatres, Unlock 5.0 , Movie Theatres, Centre-TeluguStop.com

మార్చి నుండి ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ కూడా థియేటర్లు ఓపెన్‌ కాలేదు.థియేటర్లు మరియు మాల్స్‌ కరోనా వ్యాప్తిని మరింతగా చేస్తాయనే ఆందోళనతో కేంద్రం థియేటర్లు అన్‌ లాక్‌ కు సిద్ద పడలేదు.

ఇప్పుడు అందరిలో అవగాహణ రావడంతో పాటు కరోనాతో సహవాసం కామన్‌ అయ్యింది.ఇప్పుడు కాకున్నా ఎప్పటికి అయినా తెరవాల్సిందే కదా అనే ఉద్దేశ్యంతో పలువురు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాయి.

ఆ ప్రయత్రం ఫలించి చివరకు కేంద్రం నుండి థియేటర్ల అన్‌ లాక్‌ కు ఓకే చెప్పారు.
అక్టోబర్‌ 15 నుండి థియేటర్లతో పాటు క్రీడాకారులు స్విమ్మింగ్‌ చేసుకునేందుకు స్విమ్మింగ్‌ పూల్స్ ను తెరిచేందుకు ఓకే చెప్పారు.

కంటోన్మెంట్‌ ఏరియాల్లో థియేటర్ల ఓపెన్‌ కు కుదరదు.పూర్తి స్థాయి లాక్ డౌన్‌ ను అక్కడ అమలు చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది.థియేటర్లలో సామాజిక దూరం పాటిస్తూనే ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ ప్రేక్షకులు మాస్క్‌ లు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాల్లో ఉంది.కేంద్రం థియేటర్లకు అనుమతులు ఇచ్చినంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్లకు మునుపటిలా క్యూ కడతారా అంటే అనుమానమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దసరా సీజన్‌ కు థియేటర్లు ఓపెన్‌ అయితే ఉంటాయి.కాని వాటికి ప్రేక్షకుల తాకిడి ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగు నిర్మాతలు మరియు దర్శకులు పలువురు దసరాకు సినిమాలను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు.దసరా సీజన్‌ కు ప్రేక్షకుల తాకిడి ఎలా ఉన్నా సంక్రాంతి వరకు మాత్రం ఖచ్చితంగా పరిస్థతులు అంతా కూడా కామన్‌ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube