అర్ధరాత్రి ఆగంతకుడు ! ప్రణయ్ ఇంటివద్ద కలకలం  

Unkown Person At Pranay Home At Miryalakuda-

  • ప్రణయ్- అమృత ప్రేమ వ్యవహారంలో ప్రియుడు ప్రణయ్ ని నరికి చంపించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రణయ్ మామ మారుతీరావు , కరీం, శ్రావణ్‌కుమార్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ను ప్రయోగించారు.

  • అర్ధరాత్రి ఆగంతకుడు ! ప్రణయ్ ఇంటివద్ద కలకలం -Unkown Person At Pranay Home At Miryalakuda

  • వారు ఇప్పుడు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్న సంగతి తేలింది.

    Unkown Person At Pranay Home Miryalakuda-

    తాజాగా… నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రణయ్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆదివారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా శనివారం ఉదయం సమయంలో ప్రణయ్ ఇంటి ఆవరణలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కలియతిరిగిన విషయాన్ని గుర్తించామని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు.

  • ఆ వ్యక్తి ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నాడని… అప్పుడే అటుగా పోలీసులు రావడంతో పారిపోయాడంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆగంతకుడు ఏ ఉద్దేశంతో అర్ధరాత్రివేళ ఆ ఇంటివద్ద సంచరించినట్టు .? దీనివెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.