నిమ్మ తొక్కలను తీసి పారేయకండి... వాటి వల్ల కూడా ఉపయోగమే అంటున్న అమ్మమ్మ  

పెరిగిన టెక్నాలజీతో చెత్త నుండి కూడా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రకాల చెత్తల నుండి ఏకంగా కరెంటును తయారు చేస్తుంటే, కొన్ని రకాల చెత్తల నుండి వర్మి కంపోస్ట్‌ ను తయారు చేస్తున్నారు. ఇక మరికొన్ని రకాల చెత్తలను కొందరు తెలివిగా వాడుకుంటూ ఉంటున్నారు. నిమ్మ రసం పిండిన తర్వాత తొక్కలు కూడా చెత్తగా మారిపోతాయి. అయితే ఆ చెత్తను కాస్త ఓపిక చేసుకుని మంచికి ఉపయోగించుకోవచ్చు అంటున్నారు అమ్మమ్మలు, నానమ్మలు.

Unkonwn Facts About Lemon Peels-Lemon Peels Uses

Unkonwn Facts About Lemon Peels

నిమ్మకాయలో ఉండే లక్షణం వల్ల పలు క్రిమి కీటకాలు నాశనం అవుతాయి. అందుకే ఏమైనా తిన్న తర్వాత నిమ్మకాయ రసంతో కడుకుంట్టే చేతికి ఎలాంటి క్రిమి కీటకాలు ఉండవు అంటారు. అందుకే నిమ్మకాయ రసం పిండిన తర్వాత తొక్కలను గోడల రంద్రాల వద్ద, కిటికీల వద్ద పెట్టాలి. ఇలా చేయడం వల్ల చీమలు, బొద్దింకలు, పురుగులు వంటివి లోనికి రాకుండా ఉంటాయి.

Unkonwn Facts About Lemon Peels-Lemon Peels Uses

కిచెన్‌లో ఏదైనా వంట లేదా పదార్థం పెట్టి కొన్ని రోజుల వరకు దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది పాడై పోయి దుర్వాసన వస్తుంది. వాసన వచ్చేప్పటి వరకు అలాగే ఉంటే దారుణమైన వాసున వస్తుంది. ఆ వాసన వెంటనే పోవాలి అంటే ఒక గిన్నెను తీసుకుని, దాని నిండా నీళ్లు నింపి ఆ నీటిలో నిమ్మ తొక్కలు వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. అలా మరించడంతో మంచి వాసన వచ్చి కిచెన్‌లోని దుర్వాసన పోతుంది.

Unkonwn Facts About Lemon Peels-Lemon Peels Uses

ఫ్రిజ్‌ మరియు ఓవెన్‌లో కూడా అప్పుడప్పుడు దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన పోవాలి అంటే ఒక కప్పులో నీళ్లు తీసుకుని, దాంటో నిమ్మకాయ లేదా నిమ్మ తొక్కను వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గ్యాస్‌ స్టవ్‌ మరియు వంట చేసే ప్రదేశంలో నూనె చుక్కలు పడి జిడ్డుగా అనిపిస్తుంది. అప్పుడు ఆ జిడ్డుపై కాస్త ఉప్పు, సర్ఫ్‌ వేసి నిమ్మ తొక్కతో రుద్దితే జిడ్డు పోతుంది.